Dulquer Salman: ఇకపై ప్రేమకథలు చేయకూడదనుకున్నా.. రీజన్ అదే.. దుల్కర్ సల్మాన్ కామెంట్స్..
యుద్దంతో రాసిన ప్రేమకథ అంటూ ట్యాగ్‌లైన్‌తో రాబోతున్న ఈ సినిమా ఆగస్ట్ 5న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల మీడియాతో ముచ్చటించారు దుల్కర్ సల్మాన్.
మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salman). ఇప్పుడు సీతారామం మూవీతో మరోసారి టాలీవుడ్ ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. తెలుగు డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న సినిమా సీతారామం. ఇందులో మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ కు మంచి రెస్పా్న్స్ వచ్చింది. యుద్దంతో రాసిన ప్రేమకథ అంటూ ట్యాగ్‌లైన్‌తో రాబోతున్న ఈ సినిమా ఆగస్ట్ 5న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల మీడియాతో ముచ్చటించారు దుల్కర్ సల్మాన్.
‘సీతారామం’ చాలా ఒరిజినల్ కథ. రియల్లీ క్లాసిక్ మూవీ. చాలా అరుదైన కథ. ఇలాంటి సినిమా ఇప్పటి వరకూ ఎక్కడా రాలేదు. స్క్రీన్ ప్లే నాకు చాలా నచ్చింది. ఊహాతీతంగా వుంటుంది. ట్రైలర్ లో చూసింది కేవలం గ్లింప్స్ మాత్రమే. సీతారామం అద్భుతాన్ని వెండితెరపై చూడాల్సిందే అని అన్నారు దుల్కర్. అలాగే.. ప్రేమకథలు ఇక పై చేయనని చెప్పారు కదా ? అని విలేకరీ అడగ్గా.. హీరో స్పందిస్తూ.. వాటికి కొంత విరామం ఇవ్వాలని భావిస్తున్నాను. రోజురోజుకి నా వయసు కూడా పెరుగుతుంది కదా.. ఇంకా పరిణితి గల విభిన్నమైన పాత్రలు చేయాలనీ వుంది. ఫ్రెష్ , ఒరిజినల్ గా వుండే పాయింట్ల ని చేయడానికి ఎక్కువగా ఇష్టపడతాను. అంటూ చెప్పుకొచ్చారు.
అలాగే.. ఒక క్లాసిక్ నవల చదువుతున్నప్పుడు కొన్ని పాత్రలని ఇలా ఉంటాయేమోనని ఇమాజిన్ చేసుకుంటాం. ‘సీతారామం’ కథ విన్నప్పుడు సీత పాత్రని కూడా లానే ఊహించుకున్నా. ఈ పాత్రలోకి మృణాల్ వచ్చేసరికి అద్భుతమైన ఛాయిస్ అనిపించింది. సెట్స్ లో మృణాల్ ని చూస్తే సీత పాత్రకు ఆమె తప్పితే మరొకరు న్యాయం చేయలేరేమో అనిపించింది. చాలా అద్భుతంగా చేసింది. ఇక ఆఫ్ స్క్రీన్ కూడా తను హ్యాపీ, ఎనర్జిటిక్ పర్శన్. ఇందులో కొత్త రష్మిక ని చూస్తారు. ఇదివరకు ఎప్పుడూ ఇలాంటి పాత్రని చేయలేదు. సీతారామంలో రష్మిక గ్రేట్ ఎనర్జీ అని అన్నారు.