Darshan: ‘పిచ్చి అంటారు సార్ దీన్ని’.. ఏడాది బిడ్డకు దర్శన్‌లా ఖైదీ వేషం వేయించిన అభిమాని.. ఫొటోషూట్ కూడా

|

Jul 02, 2024 | 3:51 PM

అభిమాని హత్య చేయించిన కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం జైళ్లో గడుపుతున్నాడు కన్నడ స్టార్ హీరో దర్శన్. ప్రస్తుతం ఈ కేసు ఇంకా విచారణలో ఉంది. మరోవైపు దర్శన్ ఉంటోన్న జైలుకు అతని అభిమానుల హడావిడి ఎక్కువైంది. దర్శన్ జైలులో చేరినప్పటి నుంచి చాలా మంది జైలు ముంగిట గూమిగూడి ఆందోళనలు చేస్తున్నారు

Darshan: పిచ్చి అంటారు సార్ దీన్ని.. ఏడాది బిడ్డకు దర్శన్‌లా ఖైదీ వేషం వేయించిన అభిమాని.. ఫొటోషూట్ కూడా
Darshan
Follow us on

అభిమాని హత్య చేయించిన కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం జైళ్లో గడుపుతున్నాడు కన్నడ స్టార్ హీరో దర్శన్. ప్రస్తుతం ఈ కేసు ఇంకా విచారణలో ఉంది. మరోవైపు దర్శన్ ఉంటోన్న జైలుకు అతని అభిమానుల హడావిడి ఎక్కువైంది. దర్శన్ జైలులో చేరినప్పటి నుంచి చాలా మంది జైలు ముంగిట గూమిగూడి ఆందోళనలు చేస్తున్నారు. దర్శన్ ను కోర్టుకు తీసుకెళ్తుండగా.. షూటింగ్ జరుగుతోందంటూ అభిమానులు ‘డి బాస్’ అంటూ నినాదాలు చేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో దర్శన్ పై తమ ప్రేమను రకరకాలుగా చాటుకుంటున్నారు అభిమానులు. ఈ నేపథ్యంలో ఒక అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించాడు. దర్శన్ పై ఉన్న అభిమానంతో కుమారుడికి ఏకంగా ఖైదీ డ్రెస్ తొడిగించి ఫొటో షూట్ చేయించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ‘బ్రాండ్ ఆఫ్ శాండల్‌హుడ్ డి బాస్ ఫ్యాన్స్ మైసూర్’ అనే సోషల్ మీడియా ఖాతా లో ఈ పిల్లాడి ఫొటోను షేర్ చేశారు. ఇందులో ఏడాది వయసున్న చిన్నారిని ఖైదీ వేషధారణలో ముస్తాబు చేశారు. దర్శన్‌కు ఇచ్చిన అండర్ ట్రయల్ ఖైదీ నంబర్‌ 6106నే చిన్నారి డ్రెస్ పై కూడా వేయించారు. పిల్లాడి పక్కన ‘జై డి బాస్’, ఖైదీ నంబర్ 6106 అంటూ అక్షరాలు కూడా ఏర్పాటుచేశారు.

ఈ ఫొటోను చూసిన దర్శన్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే సామాన్యులు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు.
ఖైదీ వేషధారణలో చిన్నారి ఫొటో తీయడం దారుణమంటూ సదరు అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై నెట్టింట విస్తృతంగా చర్చ జరుగుతోంది. ‘ఇలా చేయడం అభిమానం అనిపించుకోదు.. పిచ్చి అంటారు దీన్ని’ అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఖైదీ వేషధారణలో ఏడాది బాలుడు.. ఫొటోస్ ఇదిగో..

 

కాగా నటుడిపై ఉన్న పిచ్చి ప్రేమ కోసం అభిమానులు ప్రతిరోజూ ట్రెండ్ అవుతున్నారు. కొందరు దర్శన్ అండర్ ట్రైయల్ ఖైదీ నంబర్ ను టాటూలుగా వేయించుకున్నారు.

6106 నంబర్ ను పచ్చ బొట్టుగా వేయించుకుంటోన్న అభిమానులు..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.