Maa Elections 2021: ఉదయాన్నే మేనిఫెస్టో ప్రకటన.. అనుహ్యంగా ఎన్నికల నుంచి తప్పుకున్న సీవీఎల్..

|

Oct 02, 2021 | 1:42 PM

మా ఎన్నికల్లో వరుస ట్విస్టులు జరుగుతున్నాయి. నామినేషన్ వేసిన అభ్యర్థులు ఒక్కొక్కరిగా పోటి నుంచి తప్పుకుంటున్నారు. 

Maa Elections 2021: ఉదయాన్నే మేనిఫెస్టో ప్రకటన.. అనుహ్యంగా ఎన్నికల నుంచి తప్పుకున్న సీవీఎల్..
Cvl
Follow us on

మా ఎన్నికల్లో వరుస ట్విస్టులు జరుగుతున్నాయి. నామినేషన్ వేసిన అభ్యర్థులు ఒక్కొక్కరిగా పోటి నుంచి తప్పుకుంటున్నారు.  నిన్న జనరల్ సెక్రటరీగా నామినేషన్ వేసిన బండ్ల గణేష్… పోటీ నుంచి తప్పుకున్నట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో అభ్యర్థి నటుడు సీవీఎల్ సైతం మా అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించారు.

ఈ సందర్భంగా సీవీఎల్ మాట్లాడుతూ.. నేను మా ఎన్నికల్లో ప్రెసిడెంట్ పదవికి పోటీలో నామినేషన్ వేశాను. ఇప్పుడు నామినేషన్ ఉపసంహరించుకున్నాను. అన్ని వివరాలు రెండు రోజుల్లో మీడియా వారికి చెపుతాను. ఉదయం కూడా నా మానిఫెస్టోను ప్రకటించాను. నేను నామినేషన్ ఉపసంహరించడానికి కారణం వుంది. అధ్యక్ష పదవి కంటే నాకు మా సభ్యుల సంక్షేమం ముఖ్యం. ఇప్పుడు పోటీలో వున్న రెండు ప్యానెల్స్‏లో ఎవ్వరికీ నేను మద్దతు ఇవ్వటం లేదు అంటూ చెప్పుకొచ్చారు సీవీఎల్..  ఉదయాన్నే మేనిఫెస్టో ప్రకటించారు సీవీఎల్. ఆర్టిస్టులందరికీ అవకాశాలు వచ్చేలా చూస్తానని.. ఈమేరకు 2011లో తీసుకున్న నిర్ణయాలను కచ్చితంగా అమలు అయ్యేలా చేస్తానని.. ఆ నిర్ణయాలు అమలు చేయడానికి 50 సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేస్తానని.. త్వరలోనే వారి పేర్లను ప్రకటిస్తానని.. మేనిఫెస్టోలో తెలిపారు సీవీఎల్. అలాగే అసోసియేషన్‏లోని ప్రతి సభ్యుడికి సంవత్సరానికి రూ. 3 లక్షలు ఆరోగ్య భీమా మా చెల్లిస్తుందని.. వచ్చే ఏడాదికి జనవరి నుంచి అన్ని విధాలుగా అమలు చేస్తామని పేర్కోన్నారు. ఇక ఫిలింనగర్ కల్చరల్ క్లబ్‏లో మా సభ్యుడికి అసోసియేట్ మెంబర్ షిప్ సంపాదించడం వంటి అంశాలను పొందుపర్చారు. ఉదయాన్నే మేనిఫెస్టో ప్రకటించి అనుహ్యంగా తన నామినేషన్‏ను ఉపసంహరించుకున్నట్లుగా ప్రకటించి షాకిచ్చారు.

గత కొద్ది రోజులుగా మా ఎన్నికలు సాధారణం రాజకీయాలను తలపిస్తున్నాయి. నువ్వా నేనా అంటూ జరుగుతున్న పోరులో అభ్యర్థులు.. విమర్శలు తారా స్థాయికి చేరాయి. ఇక అక్టోబర్ 10న ఎన్నికలు జరగనుండడంతో ప్రచారాన్ని వేగవంతం చేశారు. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు అద్యక్షులుగా పోటీచేస్తుండగా.. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు సీవీఎల్. అలాగే జనరల్ సెక్రటరీగా బండ్ల గణేష్ పోటీ చేశారు. అయితే నామినేషన్ వేసిన అనంతరం నిన్న బండ్ల గణేష్ పోటి నుంచి తప్పుకున్నట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక అనుహ్యాంగా..సీవీఎల్ సైతం తప్పుకున్నట్లుగా ప్రకటించడంతో ఇప్పుడు అసలైన పోటీ మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ మధ్య ఉండబోతుంది.

Also Read: Aamir Khan: చిక్కుల్లో అమీర్.. మండిపడుతున్న నెటిజన్స్… క్షమాపణ చెప్పాల్సిందేనంటూ డిమాండ్.. ఇంతకీ ఏం జరిగిందంటే..

Varudu Kavalenu: వరుడు కావలెను నుంచి మరో సాంగ్.. ఆకట్టుకుంటున్న వడ్డాణం పాట..