Brahmaji: సేవ్ సినిమా.. సేవ్ థియేటర్స్.. రైటర్స్‏కు విజ్ఞప్తి చేసిన బ్రహ్మజీ.. కారణమేంటంటే..

సినిమా ప్రారంభం నుంచి విడుదలయ్యే వరకు ప్రేక్షకులను ఆసక్తిని కలిగిస్తూ.. థియేటర్స్‏కు రప్పించేందుకు

Brahmaji: సేవ్ సినిమా.. సేవ్ థియేటర్స్.. రైటర్స్‏కు విజ్ఞప్తి చేసిన బ్రహ్మజీ.. కారణమేంటంటే..
Brahmaji
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 30, 2021 | 6:35 PM

సినిమా ప్రారంభం నుంచి విడుదలయ్యే వరకు ప్రేక్షకులను ఆసక్తిని కలిగిస్తూ.. థియేటర్స్‏కు రప్పించేందుకు మేకర్స్ ప్రయత్నాల గురించి తెలిసిందే. సినిమాకు సంబంధించిన టైటిల్ దగ్గర్నుంచి.. ట్లైలర్ వరకు సస్పెన్స్ క్రియేట్ చేస్తుంటారు. ఇటీవల స్టోరీతోపాటు.. సాంగ్స్ హిటైతే చాలు మూవీ హిట్టే అనే ట్రెండ్ సాగుతుంది. హీరోహీరోయిన్స్, దర్శకనిర్మాతలకు మాత్రమే కాకుండా.. అందులో భాగమయ్యే నటీనటులు.. సాంకెతిక నిపుణులు ఇలా ప్రతి ఒక్కరిపై బాధ్యత ఉంటుంది. అయితే ప్రతి చిన్న సన్నివేశాన్ని ఎంతో జాగ్రత్తగా..ప్రేక్షకులను మెప్పించేందుకు దర్శకులు ప్రయాస గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే సినిమా పూర్తైన తర్వాత ఎలా ఉంది ? ప్రేక్షకులు ఎంతవరకు ఆధరించారు అనే విషయంపైనే సినిమా హిట్టు, ఫట్టు ఆధారపడి ఉంటుంది.

ప్రస్తుత కాలంలో ఇక సినిమా హిట్టా లేదా అనేది ఇప్పుడు రివ్యూ రైటర్స్ పైఆధారపడింది. మూవీ రిలీజ్ అయ్యాక.. రివ్యూ రైటర్స్ రాసే స్టోరీని బట్టే ప్రేక్షకులు సినిమా చూసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే రివ్యూ రైటర్స్ మూవీ స్టోరీ దగ్గర్నుంచి.. నటీనటుల నటన, సాంకెతిక పనితీరు ఇలా ప్రతి విషయంపై తమ అభిప్రాయాలను బయటపెడుతుంటారు. ఇక కరోనా పరిస్థితుల తర్వాత తాజాగా థియేటర్స్ తెరుచుకోవడంతో ఇప్పుడిప్పుడే సినిమాలు విడుదలవుతున్నాయి. అందులో భాగంగా సీనియర్ నటుడు బ్రహ్మాజీ ట్విట్టర్ వేదికగా రివ్యూ రైటర్స్ కు ఓ అభ్యర్థన చేశారు.

ఈ మేరకు… ఈ గడ్డు కాలంలో ఓ రెండు మంచి మాటలు రాసి జనాల్ని థియేటర్కి రప్పించండి లేకపోతే రివ్యూ రాయడానికి సినిమాలు ఉండవు సినిమా చూడడానికి థియేటర్స్ ఉండవు సేవ్ సినిమా సేవ్ థియేటర్స్ థాంక్యూ అంటూ ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే.. ఈరోజు (జూలై 30న) విడుదలైన సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన తిమ్మరుసు సినిమాలో బ్రహ్మజీ కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే బ్రహ్మజీ ఈ పోస్ట్ చేసినట్లుగా అర్థమవుతుంది.

ట్వీట్..

Also Read: కూతురి మరణంపై ఇప్పటికీ న్యాయ పోరాటం.. దీనస్థితిలో చిన్నారి పెళ్లి కూతురు నటి పేరెంట్స్..

Jr.NTR: తహశీల్దార్ ఆఫీస్‏లో జూనియర్ ఎన్టీఆర్ సందడి.. రావడానికి పెద్ద కారణమే ఉందట..

తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా