Arvind Swamy: ‘అందుకే 13 ఏళ్లు సినిమాలకు దూరంగా ఉండిపోయాను.. నొప్పితో బాధపడ్డాను’.. నటుడు అరవింద్ స్వామి..

అప్పట్లో వరుస సినిమాలతో కెరీర్ లో మంచి ఫాం మీదున్న అరవింద్ స్వామి.. ఆకస్మాత్తుగా సినిమాలకు దూరమయ్యాడు. చాలా కాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆయన.. ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. అప్పట్లో హీరోగా అలరించిన అరవింద్ స్వామి.. ఇప్పుడు విలన్ గా, సహయ నటుడిగా కనిపిస్తున్నాడు.

Arvind Swamy: 'అందుకే 13 ఏళ్లు సినిమాలకు దూరంగా ఉండిపోయాను.. నొప్పితో బాధపడ్డాను'.. నటుడు అరవింద్ స్వామి..
Aravindswamy
Follow us

|

Updated on: Oct 04, 2024 | 5:27 PM

ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో అమ్మాయిల ఫేవరేట్ హీరో అరవింద్ స్వామి. డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన రోజా మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. అప్పట్లో రోజా, బొంబాయి చిత్రాలతో వరుసగా హిట్స్ అందుకుని తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు. అప్పట్లో వరుస సినిమాలతో కెరీర్ లో మంచి ఫాం మీదున్న అరవింద్ స్వామి.. ఆకస్మాత్తుగా సినిమాలకు దూరమయ్యాడు. చాలా కాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆయన.. ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. అప్పట్లో హీరోగా అలరించిన అరవింద్ స్వామి.. ఇప్పుడు విలన్ గా, సహయ నటుడిగా కనిపిస్తున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ధృవ మూవీలో ప్రతినాయకుడిగా అలరించాడు. ఇక ఇప్పుడు సత్యం సుందరం వంటి ఫీల్ గుడ్ మూవీతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చాడు.

కోలీవుడ్ హీరో కార్తి, అరవింద్ స్వామి ప్రధాన పాత్రలలో నటించిన సత్యం సుందరం సినిమా సెప్టెంబర్ 28న విడుదలై మంచి ప్రశంసలు అందుకుంది. విడుదలై వారం దాటినా ఈ సినిమాకు ఆదరణ తగ్గడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొ్న్న అరవింద్ స్వామి తన లైఫ్, సినిమాలకు గ్యాప్ ఇవ్వడానికి గల రీజన్ చెప్పుకొచ్చాడు. డైరెక్టర్ మణిరత్నం ఇచ్చిన అవకాశంతోనే తన రీఎంట్రీ కూడా సాఫీగా సాగిపోతుందని అన్నారు. కెరీర్ పీక్ లో ఉన్న సమయంలోనే తనకు ఆరోగ్య సమస్యలు వచ్చాయని.. దీంతో పలు చిత్రాలను చేయలేకపోయానని అన్నారు.

వెన్నెముకకు గాయం కావడంతో రెండేళ్లపాటు రెస్ట్ తీసుకున్నానని.. ఆ సమయంలో తీవ్రమైన నొప్పితో బాధపడ్డానని.. అదే సమయంలో కాలికి పాక్షికంగా పక్షవాతం వచ్చిందని అన్నారు. దీంతో దాదాపు 13 ఏళ్లపాటు నటనకు దూరంగా ఉన్నానని.. మళ్లీ సినిమాల్లో నటించాలనుకోలేదని అన్నారు. కానీ డైరెక్టర్ మణిరత్నం ఆఫర్ ఇవ్వడంతో ఏ ప్లాన్ లేకుండానే రీఎంట్రీ ఇచ్చానని.. కడలి మూవీతోనే తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభమైందని అన్నారు. ఆ మూవీ షూటింగ్ పూర్తయ్యాక తన సంతృప్తి కోసం రెండు హాఫ్ మారథాన్ లో పాల్గొన్నానని.. సత్యం సుందరం మూవీ చాలా ఇష్టంతో చేశానని అన్నారు. ఈ చిత్రాన్ని తెలుగు అడియన్స్ కూడా ఆదరిస్తున్నారని.. అందుకు సంతోషంగా ఉందని అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.