Vijayakanth: కెప్టెన్‌ విజయ్‌ కాంత్‌కు తీవ్ర అనారోగ్యం.. ఆస్పత్రిలో చికిత్స.. ఆందోళనలో అభిమానులు

ప్రముఖ తమిళ నటుడు, డీఎండీకే నేత కెప్టెన్‌ విజయ్‌కాంత్ మళ్లీ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఛాతీ నొప్పి, నిరంతర దగ్గు సమస్యలతో ఆయన చెన్నై పోరూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. శ్వాస తీసుకోవడంలో విజయ్‌ కాంత్‌ ఇబ్బంది పడుతున్నందనున ఆయనకు కృత్రిమ శ్వాస అందిస్తున్నారు వైద్యులు.

Vijayakanth: కెప్టెన్‌ విజయ్‌ కాంత్‌కు తీవ్ర అనారోగ్యం.. ఆస్పత్రిలో చికిత్స.. ఆందోళనలో అభిమానులు
Captain Vijayakanth

Updated on: Nov 20, 2023 | 1:08 PM

ప్రముఖ తమిళ నటుడు, డీఎండీకే నేత కెప్టెన్‌ విజయ్‌కాంత్ మళ్లీ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఛాతీ నొప్పి, నిరంతర దగ్గు సమస్యలతో ఆయన చెన్నై పోరూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. శ్వాస తీసుకోవడంలో విజయ్‌ కాంత్‌ ఇబ్బంది పడుతున్నందనున ఆయనకు కృత్రిమ శ్వాస అందిస్తున్నారు వైద్యులు. శనివారం (నవంబర్‌ 18) రోజు కెప్టెన్‌ హాస్పిటల్‌లో చేరారు. గత మూడు రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి పెద్దగా మెరుగుపడలేదు. దీంతో విజయ్‌ కాంత్‌ అభిమానులు, డీఎండీకే పార్టీ నేతలు, కార్తకర్తలు ఆందోళన చెందుతున్నారు. విజయ్‌కాంత్ త్వరగా కోలుకుని ఇంటికి రావాలని ప్రార్థిస్తున్నారు. మరోవైపు రెగ్యులర్‌ ఆరోగ్య పరీక్షల కోసమే విజయ్‌కాంత్ ఆస్పత్రిలో చేరారని, త్వరలోనే ఇంటికి తిరిగి వచ్చేస్తారని డీఎండీకే ఒక ప్రకటన విడుదల చేసింది. అలాగే తమ అధినేత ఆరోగ్యంపై వస్తోన్న వదంతులను నమ్మవద్దని కోరారు. కాగా ప్రస్తుతం  విజయ్‌ కాంత్‌ వయసు 70 ఏళ్లు. గత కొన్నేళ్లుగా ఆయన తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆ మధ్యన విదేశాల్లో కూడా చికిత్స తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం కెప్టెన్‌ ఎక్కువగా ఇంటి దగ్గరే ఉంటున్నారు. డీఎండీకే పార్టీ బాధ్యతలన ఆయన సతీమణి ప్రేమలత విజయకాంత్‌ చూసుకుంటున్నారు.

కెప్టెన్ ప్రభాకర్ సినిమా తో మంచి గుర్తింపు..

తమిళ్‌లో వందలాది సినిమాల్లో హీరోగా నటించిన విజయ్‌ కాంత్‌ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే. తన డబ్బింగ్ సినిమాలతో ఇక్కడి ఆడియెన్స్‌ను బాగా అలరించారాయన. ముఖ్యంగా నటి రోజా భర్త సెల్వమణి దర్శకత్వంలో వచ్చిన కెప్టెన్‌ ప్రభాకర్‌ విజయ్‌కాంత్‌ ను స్టార్‌ హీరోగా మార్చేసింది. ఆ తర్వాత దీనినే తన ముద్దుపేరుగా మార్చుకున్నాడీ సీనియర్‌ నటుడు. ఇక సినిమాల్లో గొప్ప నటుడిగా గుర్తింపు పొందిన విజయ కాంత్ రాజకీయాల్లోనూ సత్తా చాటారు. 2005 లో డీఎండీకే (దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం) పార్టీనీ స్థాపించి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2011 నుంచి 2016 వరకు తమిళనాడు శాసన సభలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. విజయ్‌ కాంత్‌ భార్య పేరు ప్రేమలత. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

ఇవి కూడా చదవండి

వదంతులు నమ్మవద్దు: డీఎండీకే..

గతంలో విజయ్ కాంత్ కోలుకోవాలని రజనీకాంత్ ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.