Ajith Kumar: అజిత్ అదరగొట్టేస్తున్నాడుగా.. రికార్డులు సృష్టిస్తున్న హీరో.. ఈసారి మరో ఘనత..

అజిత్ కుమార్.. హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. మరోవైపు తనకు ఇష్టమైన కార్ రేసింగ్ లో పాల్గొంటున్నారు. ఇప్పటికే కార్ రేసింగ్ లో విజయాన్ని అందుకున్న అజిత్.. ఇప్పుడు మరో రికార్డ్ సృష్టించారు. దీంతో అజిత్ పై సినీతారలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

Ajith Kumar: అజిత్ అదరగొట్టేస్తున్నాడుగా.. రికార్డులు సృష్టిస్తున్న హీరో.. ఈసారి మరో ఘనత..
Ajith

Updated on: Apr 21, 2025 | 6:44 PM

కోలీవుడ్ హీరో అజిత్ కు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు అజిత్. మరోవైపు తనకు ఇష్టమైన కార్ రేసింగ్ పై దృష్టి సారిస్తున్నారు. గతంలో దుబాయ్ వేదికగా జరిగిన కార్ రేసులో అజిత విజయం సాధించి భారతదేశానికి గర్వకారణంగా నిలిచారు. ఇక తాజాగా అజిత్ మరో రికార్డ్ సృష్టించారు. ఇటీవల బెల్జియంలోని స్పా ఫ్రాంకోర్‌చాంప్స్ సర్క్యూట్‌లో జరిగిన కార్ రేస్‌లో అజిత్ పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ కార్ రేసింగ్ లో అజిత్ కుమార్ టీం రెండవ స్థానంలో నిలిచి రికార్డ్ సృష్టించారు. భారతీయ మోటార్ స్పోర్ట్స్ కు ఇది చాలా గర్వకారణమైన క్షణం అంటున్నారు ఫ్యాన్స్. మరోవైపు అజిత్ కు సినీతారలు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ ఏడాది జనవరిలో జరిగిన 24 హెట్ దుబాయ్ కారు రేసింగ్ లో పాల్గొన్న అజిత్ టీం మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇటీవల జరిగిన 12 హెచ్ రేసులోనూ మూడో స్థానంలో నిలిచింది. ఓవైపు కార్ రేసింగ్ లో పాల్గొంటూనే మరోవైపు తన సినిమాలపై ఫోకస్ చేస్తున్నారు అజిత్. విడాముయార్చి సినిమాతోపాటు గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు.

అజిత్ కుమార్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అజిత్ కుమార్‌తో పాటు నటులు త్రిష కృష్ణన్, సునీల్, ప్రభు, ప్రసన్న, అర్జున్ దాస్ మరియు ప్రియా ప్రకాష్ వారియర్ నటించారు. ఇందులో అజిత్ సరసన త్రిష నటించగా.. ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

ఇవి కూడా చదవండి :  

Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ రోమాన్స్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..

Peddi Movie: అప్పుడు రామ్ చరణ్ సరసన.. ఇప్పుడు పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే..

Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఎఫైర్ బయటపెట్టిందని పగబట్టిన హీరో.. నాలుగే సినిమాలకే ఫెడౌట్..

OTT Movie: బాబోయ్.. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..