తమిళ్ సూపర్ స్టార్ అజిత్ కుమార్ ప్రస్తుతం 24H దుబాయ్ 2025 కార్ రేసింగ్ ఈవెంట్‌కు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న అజిత్.. సుదీర్ఘ విరామం తర్వాత స్టార్ రేసింగ్ ట్రాక్‌లోకి తిరిగి వస్తున్నాడు. దీంతో అజిత్ కార్ రేసింగ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే స్టార్ కార్ రేసింగ్ చేస్తున్న వీడియోస్, ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇటీవల కార్ రేసింగ్ ట్రైనింగ్ లో అజిత్ కారు ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘటనలో అజిత్ కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో టీమ్, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అజిత్ సురక్షితంగా ఉండాలని.. కార్ రేసింగ్ సమయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ పోటీల క్వాలిఫైయింగ్ సెషన్‌లో కెరీర్‌ని, నటనను, రేసింగ్‌ని ఎలా తీసుకెళ్తారన్న ప్రశ్నకు అజిత్ ఇచ్చిన ఆన్సర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. రేసింగ్ సీజన్ మొదలయ్యే వరకు ఎలాంటి సినిమా కాంట్రాక్ట్‌పై సంతకం చేయనని అజిత్ చెప్పారు. అక్టోబర్ నుంచి మార్చి వరకు నటించాలనేది ప్లాన్ అని అజిత్ తెలిపాడు. ఇప్పుడు తాను డ్రైవర్‌గానే కాకుండా టీమ్ ఓనర్‌గా కూడా మోటర్‌స్పోర్ట్స్‌లో నిమగ్నమవ్వాలని నిర్ణయించుకున్నానని, అందుకే రేసింగ్ సీజన్ మొదలయ్యే వరకు సినిమాలపై సంతకం చేయనని అన్నారు. అంటే రేసింగ్ ముందు వరకు మాత్రమే తాను సినిమాలు చేస్తానని స్పష్టం చేశారు అజిత్. తన సినిమాలు, యాక్టింగ్ గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని అన్నారు.
అజిత్ రేసింగ్‌లోకి ఎలా వచ్చాడనే విషయాన్ని సైతం వెల్లడించారు. తాను 18 సంవత్సరాల వయస్సులోనే మోటార్ సైకిల్ రేసింగ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత తాను 21ఏళ్ల వరకు రేసింగ్‌లో పాల్గొన్నానని అన్నాడు. ఆ తర్వాతే సినిమాల్లోకి అడుగుపెట్టినట్లు చెప్పుకొచ్చాడు. 32 సంవత్సరాల వయస్సులో మోటార్ రేసింగ్‌కు తిరిగి రావాలని నిర్ణయించుకున్నానని.. కానీ బైక్ కాకుండా కార్ రేసింగ్ చేయాలనుకున్నానని అన్నాడు. అజిత్ భారతదేశంలో జరిగిన వివిధ జాతీయ ఛాంపియన్‌షిప్‌లలో పోటీ పడ్డాడు. ‘అజిత్ కుమార్ రేసింగ్’ అనే రేసింగ్ టీమ్ స్టార్ట్ చేశారు.
The Man who Lives his Real Life as a Cinema ft. Ajith Kumar🏎️🔥
Aura 📈📈📈>>>>#AjithKumarRacing pic.twitter.com/GNTZxyDci2
— Manoj Maddy (@edits_manoj) January 10, 2025
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..