
తమిళ స్టార్ హీరో అజిత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ హీరోకు తెలుగులోనూ భారీగా అభిమానులు ఉన్నారు. అందుకే అజిత్ ప్రతి సినిమా కచ్చితంగా తెలుగులోనూ రిలీజవ్వాల్సిందే. ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలతో ఆడియెన్స్ ను పలకరించాడు అజిత్. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన విదాముయార్చి బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరుగా ఆడింది. ఆ తర్వాత రిలీజైన గుడ్ బ్యాడ్ అగ్లీ సూపర్ హిట్‌గా నిలిచింది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించడం విశేషం. ఈ మూవీలోనూ త్రిషనే అజిత్ సరసన హీరోయిన్‌గా నటించింది. ఇప్పుడు మరోసారి అధిక్ రవిచంద్రన్ తోనే అజిత్ తన నెక్ట్స్ మూవీ తీయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనిపై ఓ ప్రకటన రానున్నట్లు టాక్. సినిమాల సంగతి పక్కనపెడితే అజిత్ కుమార్‌కు కార్ రేసింగ్ అంటే ఎంతిష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎక్కడ కార్ రేసింగులు జరిగినా ఇట్టే వాలిపోతుంటాడు. ఇప్పటికే పలు ఇంటర్నేషన్ కార్ రేసింగుల్లో టైటిల్స్ సాధించాడు అజిత్.
కారు రేసింగుల్లో పలు సార్లు ప్రమాదానికి గురయ్యాడు అజిత్. అయినప్పటికీ డేరింగ్ స్టంట్స్ చేస్తూనే ఉన్నాడీ స్టార్ హీరో.
కొన్ని సినిమాల్లో ఏకంగా కారుతో రియల్ స్టంట్స్ కూడా చేశాడు అజిత్. అది కూడా డూప్ లేకుండానే. దీనిపై అభిమానులు హ్యాపీగా ఉన్నా మరోవైపు తమ హీరోకు ఎప్పుడేమవుతుందోనని చాలా మంది ఆందోళన చెందుతున్నారు.
తాజాగా అజిత్‌కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన కారును ఏకంగా 232 కిలోమీటర్ల స్పీడ్‌తో నడుపుతూ కనిపించారు.
సాధరాణంగా రోడ్డుపై ఎవరికైనా వంద స్పీడ్‌కే గుండెల్లో గుబులు మొదలవుతుంది. అలాంటి అజిత్ ఏకంగా 232 కిలోమీటర్లు స్పీడ్‌తో దూసుకెళ్లడు. కార్ రేసింగ్‌ల్లో దూసుకెళ్లే అజిత్‌కు ఈ స్పీడ్ ఒక లెక్కేనా అని చాలా మందికి అనిపించి ఉండొచ్చు. కానీ రేసింగులు వేరు.. రోడ్డు జర్నీ వేరు. రోడ్డుపై అంత స్పీడ్ తో వెళ్లాలంటే కాస్తా గుండె ధైర్యం కూడా ఉండాలి. అయితే ఈ వీడియో ఇప్పటిదా.. పాతదా అనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. అయితే ప్రస్తుతం ఈ వీడియో మాత్రం నెట్టింట తెగ వైరలవుతోంది.
Ajith Kumar FULL SPEED RACING VIDEO!😎🔥Is this possible-aa!? 😯🔥
#AjithKumar #AK64 #GoodBadUgly pic.twitter.com/NrKM9nQ2Cr
— nallurwood (@nallurwood) August 22, 2025