Ajay Devgan: ‘నావల్లే నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చింది’.. అజయ్ దేవగణ్ షాకింగ్ కామెంట్స్..

|

Mar 25, 2023 | 11:37 AM

బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ట్రిపుల్ ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్ అకాడమీ అవార్డ్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ ఆస్కార్ అవార్డ్ గెలుచుకోవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Ajay Devgan: నావల్లే నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చింది.. అజయ్ దేవగణ్ షాకింగ్ కామెంట్స్..
Ajay Devgan
Follow us on

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవేదికపై నిలబెట్టిన ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలై ఏడాది పూర్తయ్యింది. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటించగా.. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, శ్రియా శరణ్, అజయ్ దేవగణ్ కీలకపాత్రలలో నటించారు. రూ.400 కోట్లతో నిర్మించిన ఈ సినిమా దాదాపు రూ. 1200 కోట్లకు పైగా రాబట్టి సెన్సెషన్ క్రియేట్ చేసింది. అలాగే.. విదేశీయులను మెప్పించిన ఆర్ఆర్ఆర్ ప్రపంచస్థాయిలో ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకుంది. ఇక సినీరంగంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డ్ కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ట్రిపుల్ ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్ అకాడమీ అవార్డ్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ ఆస్కార్ అవార్డ్ గెలుచుకోవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్, టబు, దీపక్ డోబ్రియాల్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం భోళా. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్లలో భాగంగా ఇటీవల కపిల్ శర్మ షోలో పాల్గొన్న అజయ్.. ట్రిపుల్ ఆర్ చిత్రం ఆస్కార్ అవార్డ్ అందుకోవడానికి కారణం తనే అని అన్నారు. తనవల్లే నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చిందన్నారు. అదేలా అని హోస్ట్ కపిల్ శర్మ ప్రశ్నిచడంతో.. ఒకవేళ నాటు నాటు పాటకు నేను డాన్స్ చేసి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది. నేను చేయలేదు కాబట్టే నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చిందంటూ నవ్వేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.

ఇవి కూడా చదవండి

అజయ్, టబు నటించిన భోలా నటించిన ఈ చిత్రం మార్చి 30న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రానికి అజయ్ దేవగణ్ దర్శకత్వం వహించారు. భోళా అనేది ఎమోషనల్ కోర్ తో జీవితం కంటే పెద్ద యాక్షన్ చిత్రమని అన్నారు అజయ్.