టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడవి శేష్(Adivi Sesh)నటిస్తున్న లేటెస్ట్ మూవీ మేజర్(Major). 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీగా నిర్మించింది. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు అడివి శేష్ ప్రమోషన్‌లో భాగంగా దేశమంతా పర్యటిస్తున్నారు. తాజాగా అడవి శేష్ ఓ ఇంట్రవ్యూలో మాట్లాడుతూ..
సాధారణంగా బయోపిక్‌లు పొడిపొడిగా టచ్ చేస్తారు. కానీ ఇక్కడ సినిమాకు సరిపడే గొప్ప కథ వుంది. హీరోకు భజన కొట్టే కథకాదు. మామూలు బయోపిక్‌లకు భిన్నంగా వుండే కథ ఇది. ఆయన కొన్ని పనులు చేశారు అంటే ఇప్పుడు చాలామంది నమ్మకపోవచ్చు. చాలా నెగెటివ్‌లు వస్తుంటాయి. కానీ వాటిని నమ్మబుద్ధి వేయదు అన్నారు అడవి శేష్. ఇండియన్ ట్రైనింగ్ సెంటర్‌లో శిక్షణ తీసుకుని తిరిగి ట్రైన్‌లో ఇంటికి వెళుతుండగా సందీప్ ఫ్రెండ్‌కూడా వున్నాడు. తను అస్సాం వెళుతున్నాడు. సందీప్ బెంగుళూరు వెళ్లాలి .ఆ సమయంలో ఆయన ఫ్రెండ్ నా దగ్గర డబ్బులు లేవు అని అడగడంతో తన జేబులోని వున్న మొత్తం ఇచ్చేశాడు. ఆ తర్వాత సందీప్ బెంగుళూరు వచ్చేవరకు ప్రయాణంలో ఏమీ తినలేదు. తాగలేదు. మిలట్రీ మనిషి కాబట్టి ఎవరినీ ఏమీ అడగకూడదు అనే రూల్ వుంటుంది. కానీ ఇలాంటి సంఘటన చెబితే నమ్ముతారోలేదో అని పెట్టలేదు అన్నారు అడవి శేష్. మేం సినిమా చేస్తున్నాం అని ప్రకటించాక చాలామంది 26/11 చూసేశాంకదా అన్నారు. కానీ ట్రైలర్ రిలీజ్ అయ్యాక అందరూ షాక్ అయ్యారు. ఆయన జీవితంలో ఇంత వుందా? అని ఆశ్చర్యపోయారు. బాలీవుడ్ వాళ్ళు, మలయాళంవాళ్ళు తీస్తామని ముందుకు వచ్చారు. కానీ హీరోలు తమ కొడుకులా లేరని సున్నితంగా ఆయన తల్లి తిరస్కరించారు. నన్ను చూడగానే చాలా హ్యాపీగా ఫీలయ్యారు. నేను ఆమెను అమ్మా అని పిలుస్తుంటాను.
కోవిడ్ టైంలో ప్రతిసారీ ఈ సీన్ బాగా చేద్దాం అని ప్లాన్ వేసుకుని చేస్తుంటాం. కొద్దిరోజులు చేశాక కోవిడ్ రావడంతో చాలా లిమిటేషన్‌ను క్రియేట్ చేసింది. టూమచ్ ఛాలెంజ్‌లు వున్నాయి. ఇంకా ఈ సీన్ పెడితే బాగుండేది కదా అనిపించేది. రెండు గంటలు అనేది లిమిటేషన్. 31 సంవత్సరాల కథను కొన్ని సందర్భాలలో కొంత కల్పితానికి వెళ్ళాల్సి వచ్చింది. ఇందులో ఐదు సంఘటనలు ఒకే సీన్‌లో చూపించాల్సి వచ్చింది. ఏది చెప్పినా కూడా సోల్‌లో ట్రూత్ ఉందా లేదా? ఆయన ఫీల్ అయింది చూపించామా లేదా అనేది మాకు ఛాలెంజ్‌గా అనిపించింది అంటూ చెప్పుకొచ్చారు అడవి శేష్.