Acharya Movie: మెగాస్టార్ ఆచార్య సినిమా విడుదలయ్యేది అప్పుడేనా.. అదే నిజమైతే మెగా ఫ్యాన్స్ కు పండగే..

| Edited By: Ravi Kiran

Apr 30, 2021 | 8:49 AM

కోవిడ్ దెబ్బకు ఆచార్య కూడా వెనకడుగు వేశారు. మే 13న రావాల్సిన మెగాస్టార్‌ ఇప్పుడా ఛాన్స్ లేదని చెప్పేశారు. సో ఆచార్య ఇప్పట్లో లేనట్టే అని కన్ఫార్మ్ అయిపోయింది.

Acharya Movie: మెగాస్టార్ ఆచార్య సినిమా విడుదలయ్యేది అప్పుడేనా.. అదే నిజమైతే మెగా ఫ్యాన్స్ కు పండగే..
Acharya Movie
Follow us on

Acharya Movie: కోవిడ్ దెబ్బకు ఆచార్య కూడా వెనకడుగు వేశారు. మే 13న రావాల్సిన మెగాస్టార్‌ ఇప్పుడా ఛాన్స్ లేదని చెప్పేశారు. సో ఆచార్య ఇప్పట్లో లేనట్టే అని కన్ఫార్మ్ అయిపోయింది. మరి ఇప్పుడు మిస్‌ అయితే మళ్లీ ఎప్పుడూ? ఇదే ఇప్పుడు మెగా ఫ్యాన్స్‌ను వేదిస్తున్న ప్రశ్న. ఈ క్వశ్చన్‌కు కూడా ఓ ఆన్సర్‌ మీడియా సర్కిల్స్‌లో గట్టిగానే వినిపిస్తోంది.

మేలో రిలీజ్ కావాల్సిన ఆచార్యను… కాస్త ఆలస్యంగా ఆగస్టు రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు ఆగస్టులోనూ ఓ స్పెషల్ డేట్‌ ని టార్గెట్‌ చేస్తున్నారట మెగా టీమ్‌. ఆగస్టు అంటేనే మెగా మంథ్‌… ఆ నెల 22న మెగాస్టార్‌ చిరంజీవి బర్త్‌ డే.. సో బర్త్‌ డే కానుకగా సినిమా రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో ఉన్నారట కొరటాల అండ్‌ చెర్రీ.

ఇప్పటికే ఆగస్టు 13న నేనొస్తున్నా అంటూ పుష్పరాజ్‌ ప్రకటించేశారు. మరి షార్ట్ గ్యాప్‌లో చిరు కూడా థియేటర్లలోకి వచ్చేస్తారా..? వస్తే కలెక్షన్ల మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? రెండు సినిమాల రిలీజ్‌ల మధ్య 9 రోజుల గ్యాప్‌ ఉంది కాబట్టి… కలెక్షన్ల విషయంలోనూ పెద్దగా ఎఫెక్ట్ పడకపోవచ్చన్న అంచనా వేస్తున్నారు ఇండస్ట్రీ జనాలు. మరి ఈ విషయంలో మెగాస్టార్ ప్లానింగ్ ఎలా ఉందో చూడాలి. ఇక ఆచార్య సినిమాలో చిరంజీవితోపాటు రామ్ చరణ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. చిరంజీవికి జోడీగా కాజల్, చరణ్ సరసన పూజాహెగ్డే నటిస్తున్నారు. చిరు చరణ్ లను కలిసి నటిస్తుంటే చూడాలని ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు అంగ అభిమానులు.

మరిన్ని ఇక్కడ చదవండి :

HariTeja: పాప‌ను వీడియో కాల్‌లో చూసేదాన్ని.. పాలు కూడా ఇవ్వ‌లేని ప‌రిస్థితి వ‌చ్చింది.. ఏమోష‌నల్ అయిన హ‌రితేజ‌.

Ponniyin Selvan: మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ సినిమాకు బ్రేక్ వేసిన కరోనా.. వాయిదా పడిన షూటింగ్..

Aha OTT: మ‌రో అరుదైన రికార్డును సొంతం చేసుకున్న ఆహా.. వంద‌కుపైగా దేశాల్లో కోటికి చేరిన డౌన్‌లోడ్‌లు..