టాలీవుడ్ స్టార్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ కు ఊహించని షాక్ తగిలింది. లేడీ కొరియోగ్రాఫర్ పై అత్యాచారం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటోన్న అతనికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్ఠాత్మక జాతీయ అవార్డు కూడా రద్దయ్యింది. జానీ మాస్టర్ మీద పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అవార్డుల కమిటీ పేర్కొంది. తిరుచిట్రంబలం (తెలుగులో తిరు) సినిమాకు గానూ జాతీయ ఉత్తమ కొరియోగ్రాఫర్ గా జానీకి జాతీయ అవార్డు వచ్చింది. ఈనెల 8వ తేదీన ఢిల్లీలో ఈ అవార్డు అందుకోవాల్సి ఉంది. ఇందుకోసమే జానీ మాస్టర్‌కు మధ్యంతర బెయిల్ కూడా మంజూరైంది. అయితే ఇప్పుడు ఏకంగా అవార్డు రద్దుతో జానీ మధ్యంతర బెయిల్ సందిగ్ధంలో పడింది. కాగా జానీ మాస్టర్ కు జాతీయ అవార్డును సస్పెండ్ చేయడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.. ఇలా అవార్డు రద్దు చేయడం ఏ మాత్రం సరికాదని పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో ధైర్యంగా పోస్టులు పెడుతున్నారు. జానీ మాస్టర్ కు జాతీయ అవార్డును రద్దు చేయడం చాలా బాధించిందన్నారు ప్రముఖ కొరియో గ్రాఫర్ ఆట సందీప్. ఈ మేరకు తన భార్యతో కలిసి సోషల్ మీడియాలో ఒక వీడియోను రిలీజ్ చేశారు మాస్టర్.
‘ జానీ మాస్టర్‌కు అవార్డు రద్దు అనే వార్తలు చదివి చాలా బాధపడ్డాను. ఇలా చేయడం చాలా అన్యాయం. చిన్న స్థాయి నుంచి ఎంతో కష్టపడి జాతీయ స్థాయిలో ఎదిగి.. అవార్డు సాధించడం అంటే మామూలు విషయం కాదు.. ఇలా అవార్డుని రద్దు చేయడం కరెక్ట్ కాదనిపిస్తోంది. ఆ అమ్మాయి నా వద్ద కూడా కొన్ని ఈవెంట్లకు పని చేసింది. ‘నేను జానీ మాస్టర్ వద్దే పని చేస్తున్నాను. ఆయన వద్దే ఉంటాను. నేను వేరే మాస్టర్ల వద్ద పని చేయను అని ఆమె నాతో చెప్పింది. ఎంత కంఫర్ట్ లెవెల్ ఉంటే అలా మాట్లాడుతుంది. ఇప్పుడున్న చట్టాలు సైతం అమ్మాయిలకే అనుకూలంగా ఉన్నాయి’ అంటూ వీడియోలో చెప్పుకొచ్చారు ఆట సందీప్ దంపతులు. ఈ వీడియోకు యానీ మాస్టర్ కూడా స్పందించాడు. ‘ఫైనల్‌గా ఒకరు బయటకు వచ్చి మాట్లాడారు.. నా మనసులో కూడా ఇదే ఉంది.. చివరకు మీరు చెప్పారు.. థాంక్ గాడ్ అంటూ’ అంటూ కామెంట్స్ చేసింది.
ఇక మరో నటుడు, నిర్మాత, దర్శకుడు బండి సరోజ్ కుమార్ కూడా ఇదే విషయంపై ఘాటుగా స్పందించాడు. ‘జాతీయ అవార్డు ఇవ్వడం ఆపారు. కేసు రుజువయ్యేవరకూ. మీరేమి పద్మభూషణ్, భారతరత్న ఇవ్వట్లేదు కదా. తన కొరియోగ్రఫీ టాలెంట్‌కి తన వ్యక్తిగత జీవితంతో సంబంధం ఏంటి ?? స్టుపిడ్ నిర్ణయం.. సారీ’ అంటూ తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు బండి సరోజ్ కుమార్.
జాతీయ అవార్డు ఇవ్వడం ఆపారు. కేసు ఋజువయ్యేవరకూ. మీరేమి పద్మభూషణ్, భారతరత్న ఇవ్వట్లేదు కదా.. తన #Choreography టాలెంట్ కి తన వ్యక్తిగత జీవితంతో సంబంధం ఏంటి ?? This is stupidity ! Sorry !!#Nationalawards #JaniMastercase
— Bandi Saroj Kumar (@publicstar_bsk) October 6, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..