AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aaruguru Pathivrathalu: ఆరుగురు పతివ్రతలు డైరెక్టర్ ఎవరో తెలుసా..? ఆయన కొడుకు తెలుగులో తోపు హీరో..

టాలీవుడ్ ఇండస్ట్రీలో అప్పట్లో ఓ ఊపు ఊపేసిన సినిమా ఆరుగురు పతివ్రతలు. ఇప్పటికీ ఈ సినిమా బుల్లితెరపై తెగ రెస్పాన్స్ అందుకుంటుంది. అప్పట్లో థియేటర్లలో యావరేజ్ టాక్ అందుకున్న ఈ మూవీ ఇప్పుడు మరోసారి అడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే ఈ మూవీకి సంబంధించి ఎన్నో విషయాలు తెగ వైరలవుతున్నాయి. ఇంతకీ ఈ సినిమా డైరెక్టర్ ఎవరో తెలుసా..

Aaruguru Pathivrathalu: ఆరుగురు పతివ్రతలు డైరెక్టర్ ఎవరో తెలుసా..? ఆయన కొడుకు తెలుగులో తోపు హీరో..
Aaruguru Pathivrathalu Movi
Rajitha Chanti
|

Updated on: Jul 03, 2026 | 2:04 PM

Share

టాలీవుడ్‌లో కొన్ని సినిమాలు విడుదలైన సమయంలో ఆశించిన స్థాయిలో ఆడకపోయినా టీవీల్లో మాత్రం విపరీతమైన రెస్పాన్స్ అందుకున్నాయి. ఇప్పటికీ కొన్ని సినిమాలూ స్మాల్ స్క్రీన్ పై దూసుకుపోతుంటాయి. అయితే ఇప్పుడు కాలక్రమేణా డిజిటల్ మీడియా, మీమ్ కల్చర్ పుణ్యమా అని కొన్ని ప్లాప్ సినిమాలు క్లాసిక్స్‌గా మారుతుంటాయి. అలాంటి చిత్రాల్లో 2004లో విడుదలైన ‘ఆరుగురు పతివ్రతలు’ ఒకటి. ఈ సినిమా పేరు వినగానే నేటి తరం యువతకు సోషల్ మీడియాలో వచ్చే క్రేజీ మీమ్స్, వైరల్ సీన్లు గుర్తొస్తాయి. పెళ్లయిన ఆరేళ్ల తర్వాత ఒకచోట కలిసిన ఆరుగురు స్నేహితులు తమ వైవాహిక జీవితాల్లోని సాధకబాధకాలు, రహస్యాలను పంచుకునే భిన్నమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. అలాగే ఈ చిత్రంలో స్టార్ హీరోహీరోయిన్లు ఎవరు నటించలేదు. అయినప్పటికీ ఈ చిత్రానికి బుల్లితెరపై మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని రోజులుగా ఈ మూవీపేరు మరోసారి సోషల్ మీడియాలో మారుమోగుతూ ఉంటుంది. అయితే ఈ విభిన్నమైన, బోల్డ్ కంటెంట్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు ఎవరో మీకు తెలుసా? ఆయనే టాలీవుడ్‌లో ‘కామెడీ కింగ్’గా పేరుగాంచిన దిగ్గజ దర్శకుడు, నేటి స్టార్ హీరో అల్లరి నరేష్ తండ్రి అయిన ఈవీవీ సత్యనారాయణ.

ఈవీవీ సత్యనారాయణ అనగానే మనకు ‘జంబలకడిపంబ’, ‘ఆ ఒక్కటీ అడక్కు’, ‘అప్పుల అప్పారావు’, ‘హలో బ్రదర్’ వంటి అచ్చమైన వినోదభరిత చిత్రాలు గుర్తొస్తాయి. కానీ ఆయన కేవలం కామెడీ మాత్రమే కాకుండా, సమాజంలోని కొన్ని సున్నితమైన అంశాలను, వైవాహిక బంధాల వెనుక ఉండే మనస్తత్వాలను అంతే బోల్డ్‌గా చర్చించగలరని ఈ సినిమాతో నిరూపించారు. ‘ఈవీవీ సినిమా’ బ్యానర్‌పై ఆయనే స్వయంగా నిర్మించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అన్నీ తానై నడిపించారు. ఇందులో ఎక్కువ మంది కొత్త నటీనటులు నటించగా, చలపతి రావు, ఎల్.బి. శ్రీరామ్ వంటి సీనియర్ నటులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు మరో ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో ఎలాంటి పాటలు ఉండవు, కేవలం కమలాకర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రమే ఉంటుంది.

విడుదలైన సమయంలో ఈ సినిమాపై కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ, నేటి జనరేషన్ నెటిజన్లకు మాత్రం ఇది ఒక వినోదాల గనిలా మారింది. ఇందులోని పాత్రలు, సంభాషణలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్ర్రెండ్ అవుతున్నాయి. ఎంతలా అంటే, ఈ సినిమాను థియేటర్లలో మళ్లీ రీ-రిలీజ్ చేయాలనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అల్లరి నరేష్‌ను హీరోగా పరిచయం చేసి ఎన్నో విజయవంతమైన చిత్రాలు అందించిన ఈవీవీ సత్యనారాయణ, కెరీర్ ముగింపు దశలో ఇలాంటి ఒక ప్రయోగాత్మక చిత్రాన్ని తీశారనే విషయం ఇప్పటికీ చాలా మంది సినీ ప్రియులను ఆశ్చర్యపరుస్తుంది.

ఎక్కువ మంది చదివినవి : Arundhati Movie: అరుంధతి సినిమాను రిజెక్ట్ చేసి తప్పు చేశాను.. అతడు మాటలు విని వదిలేశా.. టాలీవుడ్ హీరోయిన్..

అల్లరి నరేష్ పోస్ట్..

ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: ఆ హీరోలాంటి మనిషి ఇంకొకరు ఉండరు.. పద్మ శ్రీ వచ్చిందని తెలిసి ఏమన్నారంటే.. మురళి మోహన్..

Follow Us