Coolie Movie: రజనీకాంత్‌ కాళ్లకు నమస్కరించిన సూపర్ స్టార్.. తలైవా ఏం చేశారో తెలుసా? వీడియో వైరల్

బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ 'కూలీ' సినిమాలో ఒక కీలక పాత్ర పోషించాడు. రజనీకాంత్ పై ఉన్న అభిమానంతోనే ఆయన ఈ రోల్ చేశారనిపిస్తోంది. ఈ క్రమంలో శనివారం (ఆగస్టు 02) జరిగిన కూలీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.

Coolie Movie: రజనీకాంత్‌ కాళ్లకు నమస్కరించిన సూపర్ స్టార్.. తలైవా ఏం చేశారో తెలుసా? వీడియో వైరల్
Coolie Movie Trailer Launch Event

Updated on: Aug 03, 2025 | 12:10 PM

రజనీకాంత్ వయసు ఇప్పుడు 74 సంవత్సరాలు. ఈ వయసులోనూ ఆయన ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు. వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తున్నారు. ఈ సంగతి పక్కన పెడితే సూపర్ స్టార్ రజనీకాంత్ కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. బాలీవుడ్, టాలీవుడ్, శాండల్ వుడ్.. ఇలా అన్నీ ఇండస్ట్రీలకు చెందిన హీరోలందరూ రజనీని అమితంగా అభిమానిస్తారు. ఆరాధిస్తారు. ఈ క్రమంలోనే రజనీపై ఉన్న అభిమానంతో బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ కూలీ సినిమాలో ఒక కీలక రోల్ లో కనిపించారు. ఈ క్రమంలో శనివారం (ఆగస్టు 02) జరిగిన కూలీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ కు ఆమిర్ కూడా హాజరయ్యారు. సినిమాలో తను పోషించిన గెటప్ తోనే ఆమిర్ ఈ వేడుకకు రావడం విశేషం. ఆమిర్ వేదిక దగ్గరకు రాగానే మిగతా ఆర్టిస్టులు లేచి నిలబడి బాలీవుడ్ సూపర్ స్టార్ కు నమస్కరించారు. ఇక అక్కడున్న అభిమానులు అయితే ఈలలు, కేకలతో వేదికను హోరెత్తించారు. ఇదే క్రమంలో ఆమిర్ ఖాన్ రజనీకాంత్ దగ్గరికి వెళ్లి ఆయన పాదాలకు నమస్కరించారు. కానీ రజనీకాంత్ వెంటనే ఆమిర్ ఖాన్ చేతులు పట్టుకుని పైకి లేపాడు. తర్వాత ఆయనను ప్రేమతో హత్తుకున్నారు. ఇలా ఇద్దరు సూపర్ స్టార్లను ఒకే ఫ్రేమ్ లో చూసి అభిమానులు హోరెత్తిపోయారు. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై వీరి కాంబినేషన్ ను చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా రజనీకాంత్ పై ఉన్న అభిమానం కారణంగా ఆమీర్ ఖాన్ ‘కూలీ’ సినిమాలో నటించారు. కూలీ ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు బాలీవుడ్ సూపర్ స్టార్..’రజనీకాంత్ సార్ వల్లే నేను ఈ సినిమాను అంగీకరించాను. నాకు ఆయన చిరునవ్వు, కళ్ళు, ఎనర్జీ బాగా నచ్చుతాయి. అందకు నేను సినిమా కథ కూడా అడగలేదు. రెమ్యునరేషన్ కూడా తీసుకోవడం లేదు . డేట్స్ గురించి కూడా అడగలేదు. షూటింగ్ ఎప్పుడు జరుగుతుందో మాత్రమే అడిగాను’ అని చెప్పుకొచ్చారు ఆమిర్.

ఇవి కూడా చదవండి

కూలీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ఆమిర్ ఖాన్ ఎంట్రీ

 

స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ‘కూలీ’సినిమాలో రజనీ, ఆమిర్ లతో పాటు అక్కినేని నాగార్జున, శ్రుతి హాసన్, ఉపేంద్ర, రచితా రామ్, పూజా హెగ్డే తదితరులు యాక్ట్ చేశారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 14న గ్రాండ్‌గా విడుదల కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.