AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadi Saikumar: ఆది కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్.. హీరోయిన్‏గా ఆర్ఎక్స్ 100 బ్యూటీ..

యంగ్ హీరో ఆది సాయికుమార్ ప్రస్తుతం ఎం. వీరభద్రం దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్‏గా తెరకెక్కుతున్న

Aadi Saikumar: ఆది కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్.. హీరోయిన్‏గా ఆర్ఎక్స్ 100 బ్యూటీ..
Aadi
Rajitha Chanti
|

Updated on: Jun 22, 2021 | 2:39 PM

Share

యంగ్ హీరో ఆది సాయికుమార్ ప్రస్తుతం ఎం. వీరభద్రం దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్‏గా తెరకెక్కుతున్న ఈ సినిమాను విజన్ సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.3గా ప్రముఖ వ్యాపారవేత్త డా.నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీకి కిరాతక అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు మేకర్స్. అంతేకాకుండా… ఇందులో ఆదికి జోడిగా పాయల్ రాజ్ పుత్ నటించబోతుందట.

విజన్ సినిమాస్ బ్యాన‌ర్‌లో ఆది సాయికుమార్ , ఎం. వీర‌భ‌ద్రం గారి కాంబినేష‌న్‌లో `కిరాత‌క‌`అనే చిత్రం రూపొందిస్తున్నాం. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో డైరెక్ట‌ర్ వీర‌భ‌ద్రం గారు చెప్పిన క‌థ బాగా న‌చ్చింది. అతి త్వ‌ర‌లో షూటింగ్ ప్రారంభించ‌బోతున్నాం అంటూ చెప్పుకోచ్చారు చిత్ర‌ నిర్మాత డా. నాగం తిరుపతి రెడ్డి.

Payal Rajput ఈ సందర్భంగా.. చిత్ర దర్శకుడు.. ఎం. వీరభద్రం మాట్లాడుతూ.. గతంలో ఆది ప్రధాన పాత్రలో.. నేను దర్శకత్వం వహించిన చుట్టాలబ్బాయి కమర్షియల్ గా మంచి విజయం సాధించింది. మరోసారి మా ఇద్దరి కాంబోలో మంచి సినిమా రాబోతుంది. ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యింది. ఇందులో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే విజ‌న్ సినిమాస్ ప‌తాకంపై నాగం తిరుపతిరెడ్డి గారు అన్‌కాంప్ర‌మైజ్‌డ్‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం, అలాగే రామ్‌రెడ్డి గారి విజువ‌ల్స్ సినిమాకి ప్లస్ అవుతాయి అన్నారు.

Also Read: Vamsadhara tribunal : ట్రిబ్యూనల్ తీర్పు పై సీఎం హ్యాపీ, నేరడి బ్యారేజ్ శంఖుస్థాపనకి సీఎం తోపాటు, ప్రజాప్రతినిధుల్ని ఆహ్వానిస్తాం : సీఎం జగన్

Covid Vaccination: విద్యార్థులు, తల్లిదండ్రుల్లో కొత్త టెన్షన్.. జూలై 1నుంచి విద్యాసంస్థలు షురూ.. క్లారిటీ లేని వ్యాక్సినేషన్!

Vijay Devarakonda : విజయ్ దేవరకొండ ‘లిగర్’ OTT లో విడుదల అవుతుందా..! 200 కోట్లు ఆఫర్ చేశారంట..?

Space Walkers: ఆరున్నర గంటల ఆపరేషన్ తో అంతరిక్షంలో కొత్త సోలార్ శ్రేణి అమర్చిన నాసా స్పేస్ వాకర్స్