Salaar Movie: సౌండ్ ఆఫ్ సలార్.. వీడియో చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే..!

|

Dec 23, 2023 | 4:06 PM

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాకు మొదటి రోజు ఏకంగా 170 కోట్లకు కలెక్ట్ చేసి ఈ ఏడాది టాప్ సినిమాగా నిలిచింది. ఇప్పటివరకు ఏ హీరో అందుకొని రికార్డ్ ను ప్రభాస్ అందుకున్నాడు. ఒక్క రోజులోనే 170 కోట్లు కలెక్ట్ చేసిన సలార్ సినిమా అన్ని ఏరియాల్లో సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

Salaar Movie: సౌండ్ ఆఫ్ సలార్.. వీడియో చూస్తే  గూస్ బంప్స్ రావాల్సిందే..!
Salaar
Follow us on

ప్రస్తుతం ఎక్కడ చూసిన సలార్ సినిమా మేనియా కనిపిస్తుంది. నిన్న అంటే డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది సలార్  సినిమా. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాకు మొదటి రోజు ఏకంగా 170 కోట్లకు కలెక్ట్ చేసి ఈ ఏడాది టాప్ సినిమాగా నిలిచింది. ఇప్పటివరకు ఏ హీరో అందుకొని రికార్డ్ ను ప్రభాస్ అందుకున్నాడు. ఒక్క రోజులోనే 170 కోట్లు కలెక్ట్ చేసిన సలార్ సినిమా అన్ని ఏరియాల్లో సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.ఇక ఈ సినిమానుంచి తాజాగా చిత్రయూనిట్ సౌండ్ ఆఫ్ సలార్ అనే పేరుతో ఓ వీడియోను రిలీజ్ చేశారు.

సలార్ సినిమాకు రవి బస్రూర్‌ సంగీత సారథ్యం వహించిన విషయం తెలిసిందే. కేజీఎఫ్ , కేజీఎఫ్ 2 సినిమాల మాదిరిగానే సలార్ సినిమాకు కూడా తనదైన మార్క్ మ్యూజిక్ ను అందించాడు రవి బస్రూర్‌. ఇక ఇప్పుడు సౌండ్ ఆఫ్ సలార్ పేరుతో ;ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో గూస్ బంప్స్ తెప్పిస్తుంది.

ఇద్దరు స్నేహితుల మధ్య జరిగేకథతో ఈ సినిమాను తెరకెక్కించాడు ప్రశాంత్ నీల్. సలార్ సినిమా గతంలో ఆయన తెరకెక్కించిన ఉగ్రం సినిమాను పోలి ఉందన్న విమర్శలు కూడా వచ్చాయి. కానీ ఈ సినిమాను ప్రభాస్ స్టైల్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు ప్రశాంత్. ఇక సలార్ సినిమాలో ప్రభాస్ ఎలివేషన్, ఫైట్స్, ఆడియన్స్ ను ముఖ్యంగా ప్రభాస్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సలార్ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే..మొదటి పార్ట్ ఇప్పటికే బ్లాక్ బస్టర్ కావడంతో ఇప్పుడు పార్ట్ 2, కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.

\

సలార్ ట్విట్టర్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.