నట సింహం నందమూరి బాలకృష్ణ( Balakrishna)ఇటీవలే అఖండ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించింది. బాలయ్య ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. అఖండలో బాలయ్య పోషించిన అఘోర పాత్ర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు మరో మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నరు బాలకృష్ణ. రీసెంట్ గా రవితేజ తో క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన గోపీచంద్ ఇప్పుడు బాలయ్య కోసం మరో పవర్ ఫుల్ కథను సిద్ధం చేశారు. ఎన్బీకే 107(NBK 107 )అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా దాదాపు 40 శాతం షూటింగ్ జరుపుకుంది. ఇదిలా ఉంటే నేడు తెలుగు ప్రజల ఆరాధ్య దైవం.. నందమూరి తారక రామారావు 100 జయంతి సందర్భంగా బాలయ్య సినిమానుంచి ఓ పవర్ ఫుల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
ఈ పోస్టర్ లో బాలయ్య అదరగొట్టారు.. కత్తి చేత పట్టుకొని శత్రులను తెగ నరుకుతున్న స్టైల్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో వైట్ అండ్ వైట్ దుస్తుల్లో ఉన్న బాలయ్య.. తన చేతిలో రక్తంతో తడిసిన ఒక పెద్ద కత్తిని పట్టుకుని నిలబడి ఉండటాన్ని చూపించారు. ఇక ఈ సినిమాకు రకరకాల పేర్లు అనుకుంటున్నారని సోషల్ మీడియాలో వార్తలు నిత్యం చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకు జై బాలయ్య అనే టైటిల్ దాదాపు ఖరారైందని అంటున్నారు. ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా శృతి హాసన్ నటిస్తుండగా వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో కూడా బాలయ్య ద్విపాత్రాభినయం చేయనున్నారని అంటున్నారు.