OTT Movie: 13 సంవత్సరాల క్రితం విడుదలైన సినిమా.. ఇప్పటికీ వణుకుపుట్టిస్తోంది.. చూసేందుకు భయపడిన జనాలు..

ఈరోజుల్లో హారర్ సినిమాలు చూసేందుకు జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే ఓటీటీల్లో ఎక్కువగా ఈ జానర్ చిత్రాలను రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. తెలుగు, హిందీ, తమిళం భాష ఏదైన భయానక కథలు మాత్రం ఎప్పటికప్పుడు కొత్తగా అడియన్స్ ముందుకు వస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా మాత్రం ఏకంగా 13 ఏళ్ల క్రితం విడుదలైంది.

OTT Movie: 13 సంవత్సరాల క్రితం విడుదలైన సినిమా.. ఇప్పటికీ వణుకుపుట్టిస్తోంది.. చూసేందుకు భయపడిన జనాలు..
1920 Evil Returns

Updated on: Jun 22, 2025 | 7:42 AM

హారర్ సినిమాలు చూడడమంటే మీకు ఇష్టమా.. ? అయితే మీకు ఈ సినిమా గురించి తెలియాల్సిందే. దాదాపు 13 ఏళ్ల క్రితం విడుదలైంది. కానీ ఇప్పటికీ ఈ సినిమాను చూడాలంటే జనాలు వణుకిపోతుంటారు. ఈ మూవీ జనాలను భయపెట్టడమే కాదు.. మిస్టరీ.. సస్పెన్స్ చివరి వరకు మిమ్మల్ని కట్టిపడేస్తుంది. ఈ సినిమా గురించి అనేక విషయాలు తెలుసుకుంటే చూడాలనే క్యూరియాసిటి పెరిగిపోతుంది. ఇప్పటివరకు విడుదలైన హారర్ మూవీ జాబితాలో ఈ మూవీ అగ్రస్థానంలో ఉంది. అదే 1920: ఈవిల్ రిటర్న్స్. 2012లో విడుదలైన ఈ సినిమా మనల్ని 1920లకు తీసుకెళ్తుంది. అక్కడ ఒక పాత రాజభవనం.. ఒక రహస్య ఆత్మ.. అలాగే ఒక ప్రేమకథ. ఈ మూడు అంశాలు మిమ్మల్ని థ్రిల్ చేస్తుంది. ఈ సినిమా కథ.. ఒక రహస్య అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. అలాగే ఆమె ఆత్మ అందరినీ వెంటాడుతుంది.

ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన డైరెక్టర్ మరెవరో కాదు.. భారతీయ హర్రర్ సినిమాలో సుప్రసిద్ధుడైన విక్రమ్ భట్. ఇందులో (అఫ్తాబ్ శివదాసాని) కవి జైదేవ్ వర్మగా నటనతో కట్టిపడేశాడు. అలాగే (టియా బాజ్‌పాయ్) రహస్య అమ్మాయి స్మృతిగా కనిపించింది. భయం, అమాయకత్వం అద్భుతమైన కలయిక ఆమెది. అలాగే ఇందులో విద్యా మాల్వాడే , శరద్ కేల్కర్ ముఖ్య పాత్రలు పోషించారు. ఆకస్మాత్తుగా వచ్చే ట్విస్టులు.. విజువల్స్ వణుకుపుట్టిస్తాయి. ఈ సినిమా ఆద్యంతం ఉత్కంఠ కలిగిస్తుంది. సినిమా చూస్తున్నంతసేపు భయంతో వణికిపోతారు.. కానీ చివరి వరకు చూడాలనే క్యూరియాసిటి మిమ్మల్ని నిద్రపోనివ్వదు.

ఈ చిత్రాన్ని రూ.90 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా.. బాక్సాఫీస్ వద్ద రూ.280 కోట్లకు పైగా వసూలు చేసింది. అప్పట్లో అత్యంత విజయవంతమైన హారర్ సినిమా ఉంది. ప్రస్తుతం ఈ సినిమా యూట్యూబ్ లో ఫ్రీగా చూడొచ్చు. ఇప్పటివరకు ఈ చిత్రాన్ని 110 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ సినిమా విడుదలై ఇప్పటికీ 13 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ జనాలను భయపెడుతుంది.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి :  

వయసు 41.. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు.. క్రేజ్ చూస్తే దిమాక్ కరాబ్..

సీరియల్లో పద్దతిగా.. వెకేషన్‏లో గ్లామర్‏గా.. రుద్రాణి అత్త అరాచకమే..

త్రిష అందానికి రహస్యం ఇదేనట.. ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట..

Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..