చచ్చిపోయిన మా అమ్మ కలలోకి వచ్చి బిగ్ బాస్‌కు వెళ్ళమంటుంది.. నాగార్జునగారు నన్ను పంపండి

బిగ్‌బాస్ రియాల్టీ షో.. బుల్లితెర అడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న షో ఇది. మరో రెండు నెలల్లో అంటే సెప్టెంబర్ మొదటి వారంలో ఈ షో స్టార్ట్ కానుంది. ఇప్పటివరకు 8 సీజన్స్ కంప్లీట్ చేసుకున్నఈ షో.. ఇప్పుడు 9 సీజన్ స్టార్ట్ కాబోతుంది. దీంతో కొన్ని రోజులుగా కంటెస్టెంట్స్ వీళ్లే అంటూ కొందరి పేర్లు తెరపైకి వస్తున్నాయి.

చచ్చిపోయిన మా అమ్మ కలలోకి వచ్చి బిగ్ బాస్‌కు వెళ్ళమంటుంది.. నాగార్జునగారు నన్ను పంపండి
Big Boss 9

Updated on: Jul 23, 2025 | 9:19 PM

బిగ్ బాస్ సీజన్ 9 త్వరలోనే మొదలుకానుంది. ఇప్పటికే బిగ్ బాస్ తెలుగు 8 సీజన్స్ పూర్తి చేసుకుంది. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 త్వరలోనే ప్రారంభంకానుంది. వివిధ భాషల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న బిగ్ బాస్.. తెలుగులోనూ మంచి రేటింగ్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ 9 కోసం ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విజయవంతంగా 8 సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు ఇప్పుడు సీజన్ 9కి కంటెస్టెంట్స్ ను సెలక్ట్ చేసే పనిలో ఉన్నారు టీమ్. లిస్ట్ కూడా ఫైనల్ అయ్యిందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దాదాపు 105రోజుల పాటు జరిగే ఈ గేమ్ షో కోసం సామాన్యుల నుంచి సెలబ్రెటీలు, సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్న వారు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడుతుంటారు.

ఇది కూడా చదవండి : బెడిసికొట్టిన సర్జరీ.. గుర్తుపట్టలేనంతగా మారిన నటి.. తిట్టిపోస్తున్న నెటిజన్స్

ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫులెన్సర్స్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అలాగే సీరియల్ నటులు కూడా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అలాగే సామాన్యులు కూడా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. రైతు బిడ్డగా ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ ఏకంగా విన్నర్ గా నిలిచి అందరిని షాక్ చేశాడు. దాంతో ఇప్పుడు చాలా మంది సామాన్యులు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టడానికి రెడీ అవుతున్నారు. కాగా ఈసారి కూడా సామాన్యులకు ఎంట్రీ ఉంటుందని అనౌన్స్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఎలాంటి అమ్మాయి ఎలా మార్చేశారా..! నటనతో పిచ్చెక్కించిన ఈ భామ ఎవరో తెలుసా..?

అలాగే  బిగ్ బాస్ లోకి అడుగుపెట్టాలనుకునే వారు అప్లై చేసుకోవచ్చు అంటూ ఆఫర్ ఇచ్చింది. దాంతో చాలా మంది బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే కొంతమంది సోషల్ మీడియాలో బిగ్ బాస్‌లోకి వెళ్ళడానికి చిత్రవిచిత్రమైన వీడియోలు చేస్తున్నారు. కాగా ఓ వ్యక్తి చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఓ వ్యక్తి .. మా అమ్మ నన్ను బిగ్ బాస్ లోకి వెళ్ళమంటుంది అంటూ వీడియో చేశాడు. ఈ వీడియోలో అతను మాట్లాడుతూ.. మా అమ్మ ఇటీవలే చనిపోయింది. ఎప్పుడూ కల్లోకి రాలేదు. కానీ రాత్రి నా కలలోకి వచ్చి బిగ్ బాస్ లోకి వెళ్ళమని చెప్పింది. కాబట్టి నేను బిగ్ బాస్ లోకి వెళ్లాలనుకుంటున్నా అని చెప్పుకొచ్చాడు. ఈ వీడియో పై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.

ఇది కూడా చదవండి :18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తల్లైంది.. రెండు సార్లు విడాకులు.. చివరకు ఇప్పుడు ఇలా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి