Ram Charan: రోడ్డు పై అందరూ చూస్తుండగా ట్రాఫిక్ పోలీస్‌ను ఆటపట్టించిన రామ్ చరణ్..

|

Sep 09, 2022 | 10:12 AM

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా కోసం ఇప్పుడు దేశం మొత్తం ఎదురుచూస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు చరణ్.

Ram Charan: రోడ్డు పై అందరూ చూస్తుండగా ట్రాఫిక్ పోలీస్‌ను ఆటపట్టించిన రామ్ చరణ్..
Ram Charan
Follow us on

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)సినిమా కోసం ఇప్పుడు దేశం మొత్తం ఎదురుచూస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు చరణ్. జక్కన్న తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరిగా నటించి మెప్పించాడు చరణ్. ఈ సినిమాలో చరణ్ నటన, బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులను ఫిదా చేసింది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు మన మెగా పవర్ స్టార్. టాప్ డైరెక్టర్ గా పేరున్న శంకర్ ఓ పవర్ ఫుల్ కథతో రామ్ చరణ్ తో సినిమా తెరకెక్కిస్తున్నారు. చరణ్ కెరీర్ లో ఇది 15వ మూవీ. ఈ సినిమాలో చరణ్ కు జోడీగా బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ మూవీ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుందని. చరణ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడని టాక్. ఓ పాత్రలో ముఖ్య‌మంత్రిగా.. మ‌రో పాత్ర‌లో ఐఏఎస్ ఆఫీస‌ర్‌గా చెర్రీ ఆక‌ట్టుకోనున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న సినిమాకు లీకుల బెడద తప్పడం లేదు. తాజాగా ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రోడ్డు పై ట్రాఫిక్ పోలీసులను ఆటపట్టిస్తున్న సన్నివేశం చిత్రీకరిస్తున్నారు. అయితే దానిని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రోడ్డు పై ట్రాఫిక్ పోలీసులను ఆటపట్టిస్తూ చరణ్ డాన్స్ చేస్తూ కనిపిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సునీల్, శ్రీకాంత్, అంజలి కీలక పాత్రలో నటిస్తున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.