Thalapathy Vijay Leo: లియో నుంచి క్రేజీ అప్డేట్.. దళపతి కోసం ఏకంగా ఐదువందల మంది డాన్సర్లు..

విజయ్ సినిమాలు వందకోట్ల మార్క్ ను దాటడం పెద్ద కష్టమేమి కాదు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్న ఆ సినిమాలు అవలీలగా వంద కోట్లకు పైగా వసూళ్లను రాబడుతూ ఉంటాయి. రీసెంట్ గా వారసుడు సినిమాతో హిట్ అందుకునోరు విజయ్.

Thalapathy Vijay Leo: లియో నుంచి క్రేజీ అప్డేట్.. దళపతి కోసం ఏకంగా ఐదువందల  మంది డాన్సర్లు..
Leo
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 09, 2023 | 9:06 AM

దళపతి విజయ్ కు తమిళ్ లోనే కాదు తెలుగులోనూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమా వస్తుందంటే మనదగ్గర కూడా కాస్త పండగ వాతావరణం కనిపిస్తోంది. విజయ్ సినిమాలు వందకోట్ల మార్క్ ను దాటడం పెద్ద కష్టమేమి కాదు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్న ఆ సినిమాలు అవలీలగా వంద కోట్లకు పైగా వసూళ్లను రాబడుతూ ఉంటాయి. రీసెంట్ గా వారసుడు సినిమాతో హిట్ అందుకునోరు విజయ్. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో విడుదలై మంచి హిట్ గా నిలిచింది. ప్రజెంట్ లియో సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు విజయ్. తనకు మాస్టర్ లాంటి డిఫరెంట్‌ హిట్ ఇచ్చిన లోకేష్‌ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కశ్మీర్ షెడ్యూల్ ఈ మధ్యే పూర్తయ్యింది.

ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచే ప్రమోషన్‌ విషయంలో కొత్త ప్లాన్‌తో ముందుకు వెళుతున్నారు మేకర్స్‌. గతంలో విజయ్ సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ను చాలా ఆలస్యంగా ఇచ్చేవారు. ముఖ్యంగా షూటింగ్ అంతా పూర్తయ్యే వరకు విజయ్‌ లుక్‌ రివీల్ అవ్వకుండా జాగ్రత్త పడేవారు. లియో విషయంలో మాత్రం ఒపెనింగ్ డే రోజే విజయ్‌ లుక్ ఎలా ఉండబోతోందో హింట్ ఇస్తూ వస్తున్నారు.

తాజాగా ఈ సినిమానుంచి మరో కీలక అప్డేట్ వచ్చింది. లియో మూవీ షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చెన్నై లో చేస్తున్నారు. చెన్నై లో ఓ సాంగ్ ను షూట్ చేస్తున్నారు. అక్కడ వేసిన ప్రత్యేకమైన సెట్ లో ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. ఇది విజయ్ ఇంట్రడక్షన్ సాంగ్ అని తెలుస్తోంది. ఈ పాటలో 500 మంది డాన్సర్లు కనిపించనున్నారని తెలుస్తోంది. రెండు వారాల పాటు ఈ పాటను షూట్ చేయనున్నారట.