Guntur Kaaram: మహేష్ బాబు స్టామినా ఇది.. పాన్ ఇండియా సినిమాలను బీట్ చేసిన గుంటూరు కారం..

గుంటూరు కారం నుంచి విడుదలైన ఒకొక్క పోస్టర్ ఫ్యాన్స్ ల్లో ఉత్సహాన్ని రెట్టింపు చేశాయి. ఇక ఈ సినిమా సాంగ్స్ కు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. గుంటూరు కారం సినిమా ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఇప్పుడు యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబుకు జోడీగా లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తుంది.

Guntur Kaaram: మహేష్ బాబు స్టామినా ఇది.. పాన్ ఇండియా సినిమాలను బీట్ చేసిన గుంటూరు కారం..
Guntur Kaaram

Updated on: Jan 09, 2024 | 10:37 AM

మహేష్ బాబు గుంటూరు కారం సినిమా కోసం ఆయన అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు మాస్ అవతార్ లో నటిస్తున్న ఈ సినిమా జనవరి 12 నుంచి థియేటర్స్ లో సందడి చేయనుంది. ఇప్పటికే ఈ సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. గుంటూరు కారం నుంచి విడుదలైన ఒకొక్క పోస్టర్ ఫ్యాన్స్ ల్లో ఉత్సహాన్ని రెట్టింపు చేశాయి. ఇక ఈ సినిమా సాంగ్స్ కు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. గుంటూరు కారం సినిమా ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఇప్పుడు యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబుకు జోడీగా లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తుంది.

అలాగే గుంటూరు కారం సినిమాలో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జైరామ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక జగపతి బాబు ఈ సినిమాలో నెగిటివ్ రోల్ లో కనిపించనున్నారని తెలుస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న గుంటూరు కారం పెద్ద ఎత్తున రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ ట్రైలర్ లో మహేష్ చెప్పిన డైలాగ్స్, యాక్షన్ సీన్స్ , ఎమోషన్ ప్రేక్షకులను అలరించాయి.

ఇక ఈ ట్రైలర్ ఇప్పుడు యూట్యూబ్ లో నయా రికార్డ్ క్రియేట్ చేసింది. గుంటూరు కారం ట్రైలర్ ను జనవరి 7న రిలీజ్ చేశారు, రాత్రి 9.09 గంటలకు ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఇక 24 గంటల్లో ఈ సినిమా రికార్డ్ స్థాయి వ్యూస్ ను సొంతం చేసుకుంది.  24 గంటల్లో  దాదాపు 40 మిలియ‌న్ల మంది ఈ ట్రైలర్ ను చూశారు. ఈ విషయాన్నిచిత్ర యూనిట్‌ అధికారికంగా ప్ర‌క‌టిస్తూ సోష‌ల్‌మీడియా వేదిక‌గా తెలిపింది. ‘గుంటూరు కారం’ తర్వాత స్థానంలో స‌లార్ 24 గంట‌ల్లో 32.58 మిలియన్ , లియో 31.91మిలియన్, బీస్ట్‌ 29.8మిలియన్, స‌ర్కారు వారి పాట 26.77 మిలియన్, అజిత్ తెగింపు 25 మిలియన్, రాధేశ్యామ్ 23.3 మిలియన్, ఆచార్య 21.86మిలియన్, బాహుబ‌లి 21.81మిలియన్, RRR 20.45 మిలియన్, KGF- 2 19.38 మిలియన్, బ్రో ది అవ‌తార్ 19.25మిలియన్ వ్యూస్ తో లిస్ట్ లో ఉన్నాయి. దాంతో మహేష్ అభిమానులు ఫుల్ కుష్ అవుతున్నారు. పాన్ ఇండియా సినిమాకాకపోయినా కూడా తమ హీరో సినిమాకు పాన్ ఇండియా సినిమాలకు మించి వ్యూస్ రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్.

గుంటూరు కారం ట్విట్టర్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి