Yash Birthday: యశ్ బర్త్‌డే వేడుకల్లో ప్రమాదం.! బ్యానర్ కడుతూ ముగ్గురు ఫ్యాన్స్ మృతి.
కన్నడ స్టార్ హీరో యశ్ కు అన్ని ఏరియాల్లో ఫ్యాన్స్ ఉన్నారు. నేడు ఈ స్టార్ హీరో పుట్టిన రోజు సందర్భంగా అన్ని చోట్ల ఫ్యాన్స్ సంబరాలు జరుపుకుంటున్నారు. మొన్నటి వరకు కన్నడ ఇండస్ట్రీలో సినిమాలు చేసిన యశ్ ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ తో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ సినిమాతో యశ్ విపరీతమైన ఫాలోయింగ్ ను పెంచుకున్నాడు.
కన్నడ స్టార్ హీరో యశ్ కు అన్ని ఏరియాల్లో ఫ్యాన్స్ ఉన్నారు. నేడు ఈ స్టార్ హీరో పుట్టిన రోజు సందర్భంగా అన్ని చోట్ల ఫ్యాన్స్ సంబరాలు జరుపుకుంటున్నారు. మొన్నటి వరకు కన్నడ ఇండస్ట్రీలో సినిమాలు చేసిన యశ్ ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ తో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ సినిమాతో యశ్ విపరీతమైన ఫాలోయింగ్ ను పెంచుకున్నాడు. అయతే ఇవ్వాళ అంటే జనవరి 8.. యశ్ పుట్టిన యశ్ పుట్టిన రోజు కావడంతో ఆయన ఫ్యాన్స్ హంగామాను మొదలెట్టారు. తమ స్టార్ హీరోను విష్ చేస్తూ.. బ్యానర్లు కడుతున్నారు. ఇక ఈ క్రమంలోనే.. ముగ్గరు యశ్ ఫ్యాన్స్ ప్రమాదానికి గురయ్యారు. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. గదగ్ జిల్లా లక్ష్మేశ్వర్ తాలూకాలోని సురంగి గ్రామంలో యష్ పుట్టినరోజు బ్యానర్‌ను ఏర్పాటు చేస్తుండగా ముగ్గురు యశ్ అభిమానులు విద్యుత్ షాక్ కు గురయ్యారు. దాంతో వారు అక్కడికక్కడే మరణించారు.
హనమంత హరిజన్ , మురళీ నాదవినమణి, నవీన్ గాజి యశ్ బర్త్ డే సందర్భంగా ఓ బ్యానర్ ను తమ గ్రామంలో కట్టబోయి కరెంట్ షాక్ కు గురయ్యారు. వీరితో పాటు ఉన్న మంజునాథ్ హరిజన్, ప్రకాష్ మాగేరి, దీపక హరిజన్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే చనిపోయిన అభిమానుల కుటుంబాలను యశ్ పరామర్శించాలని అక్కడి అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. తనకోసం ప్రాణాలు పోగొట్టుకున్న తమ స్నేహితుల కుటుంబాలను యశ్ ఓదార్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా స్థానిక ఎమ్మెల్యే చంద్రు లమాని ఆస్పత్రిని సందర్శించి క్షతగాత్రులతో మాట్లాడారు.అలాగే మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. యశ్ ప్రస్తుతం షూటింగ్ నిమిత్తం విదేశాల్లో ఉన్నారు. అభిమానులతో కలిసి ఈసారి పుట్టిన రోజును జరుపుకోలేనని ముందే చెప్పారు యశ్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos