Salman Khan Farmhouse: ఏ మై గాడ్.! సల్మాన్ ఫామ్‌హౌస్‌లోకి దూరిన దుండగులు.. వీడియో.
ముంబై శివార్ల లోని పన్వేల్‌లో ఉన్న బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్ ఫాంహౌస్ లోకి ఇద్దరు ఆగంతకులు చొరబడడం తీవ్ర కలకలం రేపింది. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది వాళ్లిద్దరిని అదుపు లోకి తీసుకున్నారు. ఇద్దరి దగ్గరి నుంచి ఫేక్ ఆధార్‌కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఇక గతంలో కూడా ఫాంహౌస్‌లో సల్మాన్‌ఖాన్‌పై దాడికి కుట్ర జరిగింది. చాలా రోజుల నుంచి సల్మాన్‌ఖాన్‌కు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వస్తున్నాయి. సల్మాన్‌ను చంపేస్తానని హెచ్చరించాడు లారెన్స్ బిష్ణోయ్ .
ముంబై శివార్ల లోని పన్వేల్‌లో ఉన్న బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్ ఫాంహౌస్ లోకి ఇద్దరు ఆగంతకులు చొరబడడం తీవ్ర కలకలం రేపింది. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది వాళ్లిద్దరిని అదుపు లోకి తీసుకున్నారు. ఇద్దరి దగ్గరి నుంచి ఫేక్ ఆధార్‌కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఇక గతంలో కూడా ఫాంహౌస్‌లో సల్మాన్‌ఖాన్‌పై దాడికి కుట్ర జరిగింది. చాలా రోజుల నుంచి సల్మాన్‌ఖాన్‌కు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వస్తున్నాయి. సల్మాన్‌ను చంపేస్తానని హెచ్చరించాడు లారెన్స్ బిష్ణోయ్ . ఇదే సమయంలో సల్మాన్ ఫాంహౌస్‌లో ఇద్దరు చొరబడడం తీవ్ర సంచలనం రేపింది. అయితే ముంబైలో బాలీవుడ్ హీరోలను చూసేందుకే తాము వచ్చినట్టు ఆ ఇద్దరు పోలీసుల విచారణలో వెల్లడించినట్టు తెలుస్తోంది. అభిమానులుగా చెప్పుకుంటున్న ఈ ఇద్దరిని అజేష్ కుమార్, ఓంప్రకాష్ గిల్ మరియు గురుసేవక్ సింగ్‌లుగా గుర్తించారు. వారి ఆధార్ కార్డును పరిశీలించగా అవి నకిలీ ఆధార్ కార్డులని తెలిసింది. అయితే ప్రస్తుతం వీరిని విచారిస్తున్నామని, మరింత సమాచారం అందాల్సి ఉందన్నారు. నకిలీ ఆధార్‌లతో ఫామ్‌హౌస్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించడం వెనుక ఆంతర్యం ఏమిటో తెలియాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్ ఇప్పటికే సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామని బెదిరించారు. ముఖ్యంగా బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి తరచూ బెదిరింపులు వస్తున్నాయి . దీంతో సల్మాన్‌కి వై ప్లస్ భద్రతను కల్పించారు. భద్రతలో భాగంగా బుల్లెట్ ప్రూఫ్ కార్లను కూడా కొనుగోలు చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos