AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దీపావళి వార్.. దళపతికి పోటీగా ఆ ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు.. ఈసారి మోత గట్టిగా మోగనుంది..

పండగలు వచ్చాయంటే సినిమా ఇండస్ట్రీ కళకళలాడుతుంది. పోటాపోటీగా సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇక టాలీవుడ్ కు సంక్రాంతి పండుగ సినిమా సీజన్ అనే చెప్పాలి.

దీపావళి వార్.. దళపతికి పోటీగా ఆ ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు.. ఈసారి మోత గట్టిగా మోగనుంది..
Rajeev Rayala
|

Updated on: Jun 01, 2021 | 7:38 AM

Share

పండగలు వచ్చాయంటే సినిమా ఇండస్ట్రీ కళకళలాడుతుంది. పోటాపోటీగా సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇక టాలీవుడ్ కు సంక్రాంతి పండుగ సినిమా సీజన్ అనే చెప్పాలి. స్టార్ హీరోల సినిమాలు అన్ని సంక్రాంతిని టార్గెట్ చేసుకొనే రిలీజ్ ప్లాన్ చేసుకుంటుంటారు. ఇప్పుడు దీపావళికి స్టార్ హీరోల సినిమాలు పోటీ పడనున్నాయి. కానీ మనదగ్గర కాదు. ఈ పోటీ తమిళనాట నెలకొననుంది. కోలీవుడ్ హీరోలు ‘దీపావళి’ పండుగపై ఎక్కువ దృష్టిపెడతారు. దీపావళి కానుకగా తమ సినిమా ప్రేక్షకుల ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో ఉంటారు. ఈసారి ముగ్గురు స్టార్ హీరావుల సినిమాలు దీపావళికి సిద్దమవుతున్నాయి. రజనీకాంత్ తాజా చిత్రంగా ‘అన్నాత్తే’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో యాక్షన్ .. ఎమోషన్ పుష్కలంగా ఉండనున్నాయి. నయనతార .. ఖుష్బూ .. మీనా .. కీర్తి సురేశ్ ఈ సినిమాకి  ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనున్నారు. దీపావళి సందర్భంగా నవంబర్ 4వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. అలాగే అజిత్ సినిమా ‘వాలిమై’ కూడా అదే టైం లో రానుంది. హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘వాలిమై’లో హుమా ఖురేషి కథానాయికగా నటిస్తుండగా ప్రతినాయకుడిగా కార్తికేయ కనిపించనున్నాడు. ఇక దళపతి విజయ్ సినిమా కూడా దీపావళినే టార్గెట్ చేసుకుంది. విజయ్ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా కథానాయికగా పూజా హెగ్డే అలరించనుంది. అజిత్ , విజయ్ ఇద్దరికీ కూడా తమిళనాట విపరీతమైన మాస్ ఇమేజ్ ఉండటం విశేషం. ఈసారి తమిళనాట దీపావళి మోత గట్టిగానే మోగనుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

అర్ధరాత్రి నా కారును నలుగురు దుండగులు వెంబడించారు.. అది చాలా భయంకరమైన రోజు.. చేదు అనుభవాన్ని చెప్పిన నటి..

Vijay Devarakonda: నిర్మాతగానూ రాణిస్తున్న రౌడీ.. మరోసినిమాకు ప్రొడ్యూసర్ గా విజయ్ దేవరకొండ..

Lucifer Movie: మెగాస్టార్ ‘లూసిఫర్’ మూవీ అప్‏డేట్.. పోస్టర్‏తో రూమర్స్‏కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. అసలు విషయం ఎంటంటే..

Follow Us
గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో..
గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో..
బీటెక్‌లో నేరుగా రెండో సంవత్సరంలో చేరాలనుకుంటున్నారా?
బీటెక్‌లో నేరుగా రెండో సంవత్సరంలో చేరాలనుకుంటున్నారా?
ఈ పదేళ్లలో ఆ టాలీవుడ్ హీరో ఎదిగిన తీరు అద్భుతం: వడ్డే నవీన్
ఈ పదేళ్లలో ఆ టాలీవుడ్ హీరో ఎదిగిన తీరు అద్భుతం: వడ్డే నవీన్
మసి పొరల మాటు దాగిన మర్మం.. బయటపడ్డ వేల ఏళ్ల కళా వైభవం!
మసి పొరల మాటు దాగిన మర్మం.. బయటపడ్డ వేల ఏళ్ల కళా వైభవం!
వంట చేసేప్పుడు ఈ చిట్కాలు పాటస్తే చాలు..గ్యాస్ ఈజీగా ఆదా చేయొచ్చు
వంట చేసేప్పుడు ఈ చిట్కాలు పాటస్తే చాలు..గ్యాస్ ఈజీగా ఆదా చేయొచ్చు
Asian Games 2026: ఈ ముగ్గురు పాక్ ప్లేయర్లతో టీమిండియా జాగ్రత్త
Asian Games 2026: ఈ ముగ్గురు పాక్ ప్లేయర్లతో టీమిండియా జాగ్రత్త
అప్పట్లో తోపు హీరో.. కట్ చేస్తే.. తెలుగులో పాపులర్ కమెడియన్..
అప్పట్లో తోపు హీరో.. కట్ చేస్తే.. తెలుగులో పాపులర్ కమెడియన్..
కాకినాడలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అవగాహన కార్యక్రమం
కాకినాడలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అవగాహన కార్యక్రమం
మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ! బీజేపీ ఎంపీల ఏకగ్రీవం!
మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ! బీజేపీ ఎంపీల ఏకగ్రీవం!
చిరంజీవి 'విశ్వంభర'కు విజువల్ ఎఫెక్ట్స్ తలనొప్పులు
చిరంజీవి 'విశ్వంభర'కు విజువల్ ఎఫెక్ట్స్ తలనొప్పులు