సోనూసూద్​ ఇంటికి 11వేల ఉత్తరాలు….

సోనూసూద్..రీల్ లైఫులో ఎక్కువ‌గా విల‌న్ పాత్ర‌లు వేస్తూ ఉంటారు. కానీ రియ‌ల్ లైఫులో ఆయ‌న వ‌ల‌స కూలీల పాలిట హీరో. వారు మాత్ర‌మే కాదు చాలామంది ఇప్పుడు ఆయ‌న్ని హీరోగా కీర్తిస్తున్నారు. ప్ర‌స్తుత క‌రోనా సంక్షోభ స‌మ‌యంలో లాక్ డౌన్ విధించ‌డంతో ప్ర‌జ‌ల జీవ‌న వ్య‌వ‌స్థ చిన్నాభిన్న‌మైంది. ముఖ్యంగా ఎలా బ్ర‌త‌కాలో, సొంతూర్ల‌కు ఎలా వెళ్లాలో తెలియ‌క ఆవేద‌న చెందారు.

సోనూసూద్​ ఇంటికి 11వేల ఉత్తరాలు....
Follow us

|

Updated on: Jun 12, 2020 | 3:51 PM

సోనూసూద్..రీల్ లైఫులో ఎక్కువ‌గా విల‌న్ పాత్ర‌లు వేస్తూ ఉంటారు. కానీ రియ‌ల్ లైఫులో ఆయ‌న వ‌ల‌స కూలీల పాలిట హీరో. వారు మాత్ర‌మే కాదు చాలామంది ఇప్పుడు ఆయ‌న్ని హీరోగా కీర్తిస్తున్నారు. ప్ర‌స్తుత క‌రోనా సంక్షోభ స‌మ‌యంలో లాక్ డౌన్ విధించ‌డంతో ప్ర‌జ‌ల జీవ‌న వ్య‌వ‌స్థ చిన్నాభిన్న‌మైంది. ముఖ్యంగా వ‌ల‌స కార్మికులు ఎలా బ్ర‌త‌కాలో, సొంతూర్ల‌కు ఎలా వెళ్లాలో తెలియ‌క ఆవేద‌న చెందారు. ఈ క్ర‌మంలో ప‌లుచోట్ల చిక్కుకుపోయిన వ‌ల‌స‌కూలీల‌ను సొంత ఊర్ల‌కు పంపేందుకు యాక్ట‌ర్ సోనూసూద్ న‌డుం బిగించారు. విమానాలు, బస్సులు, రైళ్ల ద్వారా వారిని స్వస్థలాలకు చేరుస్తున్నారు. తాజాగా ఒడిశా కేంద్రపారా జిల్లాలో చిక్కుకున్న వందలాది మంది యువతులను తమ సొంతఊర్ల‌కు త‌ర‌లించారు. ఈ నేప‌థ్యంలో సోనూకు ధ‌న్యావాదాలు తెలుపుతూ కేంద్రపారా నౌజవాన్​ యూనియన్​ వినూత్న కార్యక్రమానికి బీజం వేసింది.

‘థ్యాంక్​ యూ సోనూ అని రాసిఉన్న సుమారు 11వేల పోస్టుకార్డులను ఆయన ఇంటికి పంపేందుకు పూనుకుంది. జిల్లా మేజిస్ట్రేట్​ సమర్త్​​ బర్మా ఈ కార్యక్రమాన్ని గురువారం స్టార్ట్ చేశారు. జిల్లాలోని వివిధ బ్లాక్​లు, మున్సిపాలిటీల నుంచి 8,500 లెట‌ర్స్ పంపనున్నారు. మహంగా, సాలేపూర్​ నియోజకవర్గాలకు చెందిన మరో 2,500 పోస్టుకార్డులను.. ముంబయి పశ్చిమ అంధేరి యమునానగర్​లోని సోనూ ఇంటికి చేరవేయనున్నట్లు యూనియన్​ ప్రెసిడెంట్ తెలిపారు.