టాలీవుడ్‌లోని బడా నిర్మాణ సంస్థల్లో మైత్రీ మూవీ మేకర్స్ ఒకటి. శ్రీమంతుడు చిత్రం ద్వారా నిర్మాణ రంగంలోకి అడుగెట్టిన ఈ సంస్థ.. అనతికాలంలోనే మంచి పేరును సంపాదించుకుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సంస్థ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమౌతోందట. ఈ క్రమంలో సల్మాన్ ఖాన్ బావమరిది, నిర్మాత అతుల్ అగ్నిహోత్రితో సంప్రదింపులు చేశారట మైత్రీ నిర్మాతలు. సల్మాన్‌తో సినిమా తీయాలనుకుంటున్నట్లు తమ అభిప్రాయాన్ని అతుల్‌తో చెప్పారట. ఆ నిర్ణయంపై అతుల్ కూడా సానుకూలంగా స్పందించారట. ఇక త్వరలో మరోసారి ఆయనను కలవనున్న మైత్రీ నిర్మాతలు.. కథపై సల్మాన్‌తోనూ సంప్రదింపులు జరపనున్నారట. ఒకవేళ ఆ కథ సల్లూ భాయ్‌కు నచ్చితే.. త్వరలోనే మైత్రీ సంస్థ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది.
కాగా తెలుగులో మైత్రీ సంస్థ ఇప్పుడు రెండు చిత్రాలను నిర్మిస్తోంది. అందులో వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇస్తోన్న ఉప్పెన ఒకటి. బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో తెరకెక్కుతోన్న మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. వీటితో పాటు పవన్ కల్యాణ్-హరీష్ శంకర్ చిత్రాన్ని ఈ సంస్థ నిర్మించనుంది. అలాగే ప్రభాస్‌తోనూ ఓ ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టినట్లు సమాచారం.
Read This Articles Also:‘మైత్రీ’లో చీలికలు.. తప్పుకున్న ఆ నిర్మాత.. సాక్ష్యం ఇదే..!