
రామ్‌చరణ్ పెద్ది సినిమాపై ఎఫెక్ట్ పడాలనే వివాదాన్ని క్రియేట్ చేశారా! ఇండస్ట్రీలో ఇప్పుడిదే టాక్ నడుస్తోంది. ఇన్‌డైరెక్ట్ స్పీచ్‌లు, దాపరికాలు లేకుండా డైరెక్టుగానే అనేస్తున్నారీ మాట. నిజానికి ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్ల మధ్య ఉన్న గొడవ ఇప్పటిది కాదు. దశాబ్దాలుగా నడుస్తున్నదే. కాని, ఇప్పుడే సీరియస్‌గా తీసుకున్నారు. ‘సినిమా కలెక్షన్లలో తమకూ పర్సంటేజ్ ఇస్తే సరే సరి.. లేదంటే ఎంతటి సినిమానైనా ఆపేస్తాం’ అనే ధోరణి కనిపిస్తోంది. ఆల్రడీ.. సింగిల్ స్క్రీన్లలో కొన్ని సినిమాలను ఆడించడం లేదు కూడా. ఆడియెన్స్‌కు ఈ విషయం తెలియకపోవచ్చు గానీ.. ఇండస్ట్రీలోని వాళ్లందరికీ ఈ గొడవ తెలుసు. ఈమధ్య రిలీజ్ అయిన ఒకట్రెండు సినిమాలను సింగిల్ స్క్రీన్స్‌లో వేయలేదు. కారణం.. తమకూ పర్సంటేజ్ ఇవ్వాలనే. అయితే.. పెద్ది రాబోతోందని తెలిసే.. ఆ రెండుమూడు సినిమాల షోస్ వేయకుండా ఆపేశారనే టాక్ ఉంది. అసలేంటీ గొడవ? థియేటర్లకు పర్సంటేజీ లెక్కన లాభాలు పంచాలనేది దాసరి నారాయణరావు ఉన్నప్పటి నుంచి ఉన్న డిమాండ్. ఈ పద్దతి దాసరి కల కూడా. అంటే.. ఈ ఇష్యూ ఎంత పాతదో అర్థం చేసుకోవచ్చు. ఒకనాడు.. దేశంలో ఏ రాష్ట్రంలో లేనన్ని సింగిల్ స్క్రీన్స్ ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోనే ఉండేవి. ఇప్పుడదంతా గతవైభవంగా మారుతోంది. ప్రస్తుతం ఉన్న స్క్రీన్స్...