Tollywood News: సినిమా ప్రమోషన్ విషయంలో టైటిల్ కీలక పాత్ర పోషిస్తుంది. సినిమా కంటెంట్ మీద క్యూరియాసిటీ క్రియేట్ చేయాలన్నా… ఆడియన్స్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ పెంచాలన్నా… టైటిల్ దే కీ రోల్. అందుకే ఈ విషయంలో కథ అనుకున్న దగ్గర నుంచి సీరియస్‌గా ప్లాన్ చేస్తుంటారు మేకర్స్. కొందరు మేకర్స్ అయితే టైటిల్‌తోనే హిట్ మూవీ బజ్ క్రియేట్ చేయగలుగుతున్నారు. కానీ రీసెంట్ టైమ్స్‌లో టాలీవుడ్ సినిమాలను టైటిల్ కష్టాలు తరుచూ వెంటాడుతున్నాయి.
బిజినెస్ మ్యాన్ సినిమా రిలీజ్ అయినప్పుడే మహేష్ హీరోగా జనగణమన పేరుతో ఓ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు డైరెక్టర్ పూరి జగన్నాథ్. కానీ ఆ ప్రాజెక్ట్ డ్రాప్ అయ్యింది. ఆ తరువాత అదే టైటిల్‌తో విజయ్ దేవరకొండ హీరోగా సినిమా ప్లాన్ చేశారు పూరి. కానీ ఈ లోగా అదే టైటిల్‌తో మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమార్ ఓ సినిమాను రూపొందించారు. ఈ మధ్య ఆ సినిమా తెలుగు వర్షన్ కూడా ఓటీటీలో రిలీజ్ అయ్యింది.
ఆల్రెడీ అదే టైటిల్‌తో ఓ సినిమా వచ్చినా… పూరి జగన్నాథ్ మాత్రం తగ్గేదే లే అంటున్నారు. పృద్వీరాజ్ మూవీ రీజినల్ రిలీజే కాబట్టి,… పాన్ ఇండియా రేంజ్‌లో విజయ్ దేవరకొండతో తెరకెక్కిస్తున్న సినిమాకు జనగణమన అనే టైటిల్‌ను సింప్లిఫై చేసి జేజీఎం అని ఫిక్స్ చేశారు. విజయ్, పూరి బ్రాండింగ్ ఎలాగూ ఉంటుంది కాబట్టి.. జేజీఎంకు టైటిల్ ఎఫెక్ట్ పెద్దగా ఉండే ఛాన్సే లేదు.
తాజాగా నాగార్జున ఘోస్ట్ సినిమాకు కూడా టైటిల్ కష్టాలు మొదలయ్యాయి. చాలా రోజుల కిందటే ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న నాగ్ మూవీకి ది ఘోస్ట్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఆల్రెడీ ప్రమోషన్ స్టార్ట్ చేసిన మేకర్స్ ఈ మధ్యే టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు ఘోస్ట్ టైటిల్‌తోనే పాన్ ఇండియా సినిమా ఎనౌన్స్ చేశారు కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్.
లైగర్ సినిమా విషయంలోనూ ఇలాంటి కన్‌ఫ్యూజనే క్రియేట్ అయ్యింది. ఈ సినిమాకు ముందు నుంచి ఫైటర్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇదే టైటిల్‌ను అఫీషియల్‌గా ఎనౌన్స్ చేస్తారనుకుంటున్న టైమ్‌లో హృతిక్ హీరోగా హిందీలో ఫైటర్ మూవీని ఎనౌన్స్ చేశారు డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్.
హృతిక్ సినిమా టైటిల్ ఎనౌన్స్ అయిన వెంటనే… విజయ్ – పూరిల సినిమాలకు లైగర్ అనే టైటిల్‌ను కన్ఫార్మ్ చేశారు. అఫ్ కోర్స్.. ఫైటర్ కన్నా లైగర్ టైటిల్‌కే ఎక్కువగా బజ్ క్రియేట్ అయ్యింది. వరుసగా ఇలాంటి అనుభవాలే ఎదురవుతుండటంతో మన డైరెక్టర్స్ థాట్స్‌ను అదర్ లాంగ్వేజెస్‌లో కాపీ చేయటం ఇప్పుడు ట్రెండ్‌గా మారిందంటున్నారు క్రిటిక్స్.
మరిన్ని సినిమా వార్తలు చదవండి