షాకింగ్.. రిలీజ్‌ అవ్వాల్సిన సినిమాకు రీ షూటింగ్‌..!

లాక్‌డౌన్ లేకపోయి ఉంటే ఆ సినిమా ఈ పాటికి రిలీజ్‌ అయ్యేది. కానీ కరోనా రావడం, లాక్‌డౌన్‌ విధించడంతో ఆ సినిమా వాయిదా పడింది.

షాకింగ్.. రిలీజ్‌ అవ్వాల్సిన సినిమాకు రీ షూటింగ్‌..!

Edited By:

Updated on: Apr 20, 2020 | 11:29 AM

లాక్‌డౌన్ లేకపోయి ఉంటే ఆ సినిమా ఈ పాటికి రిలీజ్‌ అయ్యేది. కానీ కరోనా రావడం, లాక్‌డౌన్‌ విధించడంతో ఆ సినిమా వాయిదా పడింది. అయితేనేం లాక్‌డౌన్ ముగిసిన తరువాత ఈ మూవీ వస్తుందని అందరూ ఎదురుచూస్తున్నారు. దానికి తోడు ఆ సినిమా నుంచి వచ్చిన రెండు పాటలు మంచి టాక్‌ తెచ్చుకోవడంతో.. కొత్త హీరో, కొత్త డైరక్టర్, కొత్త హీరోయిన్ అయినా మూవీకి క్రేజ్‌ వచ్చింది. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ మూవీని రీ షూటింగ్ చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇంతకు ఆ సినిమా ఏంటంటే ఉప్పెన.

మెగాస్టార్ మరో మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్‌ సోదరుడు వైష్ణవ్ తేజ్‌ హీరోగా ఉప్పెన అనే చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. సుకుమార్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన బుచ్చిబాబు సన ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. కృతిశెట్టి హీరోయిన్‌గా నటించగా.. విజయ్‌ సేతుపతి విలన్‌గా కనిపించనున్నారు. వైష్ణవ్ తేజ్‌ మొదటి చిత్రం అయినప్పటికీ.. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించడం, స్టార్ డైరక్టర్ సుకుమార్ హ్యాండ్ కూడా ఇందులో ఉండటంతో.. ఈ చిత్రం ప్రారంభించినప్పటి నుంచే మంచి అంచనాలు మొదలయ్యాయి. దానికి తోడు ఈ మూవీ నుంచి వచ్చిన రెండు పాటలు అందరినీ ఆకట్టుకోవడంతో.. ఉప్పెన చాలా మంది వాచ్‌ లిస్ట్‌లో ఉండిపోయింది. ఈ క్రమంలో ఈ నెల 2వ తేది ఈ చిత్రం వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ లాక్‌డౌన్ నేపథ్యంలో సినిమా విడుదల వాయిదా పడింది.

ఇక ఇప్పుడు ఈ మూవీకి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. అందులో భాగంగా కొన్ని సన్నివేశాలను రీషూట్ చేయాలని మూవీ యూనిట్ భావిస్తుందట. ఇందుకోసం మరో షెడ్యూల్‌ను పెట్టాలని వారు అనుకుంటున్నారట. దీని వలన నిర్మాణ సంస్థకు మరింత భారం అయినప్పటికీ.. మంచి ఔట్‌పుట్‌ను ఇవ్వాలనుకుంటోన్న మూవీ యూనిట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మూవీని డిసెంబర్‌కు వాయిదా వేయబోతున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Read This Story Also: Coronavirus: భారత్‌లో ఎక్కువవుతోన్న ఎసింప్టమేటిక్ కేసులు..!