Coronavirus: భారత్‌లో ఎక్కువవుతోన్న ఎసింప్టమేటిక్ కేసులు..!

భారత్‌లోని కరోనా కేసుల్లో ఇప్పుడు ఎసింప్టమేటిక్ కేసులు ఎక్కువవుతున్నాయి. ఇన్ని రోజులు కరోనా వైరస్‌ శరీరంలోకి చేరిన 14 రోజుల్లో లక్షణాలు బయటపడేవి

Coronavirus: భారత్‌లో ఎక్కువవుతోన్న ఎసింప్టమేటిక్ కేసులు..!
Follow us

| Edited By:

Updated on: Apr 20, 2020 | 10:29 AM

భారత్‌లోని కరోనా కేసుల్లో ఇప్పుడు ఎసింప్టమేటిక్ కేసులు ఎక్కువవుతున్నాయి. ఇన్ని రోజులు కరోనా వైరస్‌ శరీరంలోకి చేరిన 14 రోజుల్లో లక్షణాలు బయటపడేవి. అయితే ఇప్పుడు వ్యక్తి శరీరంలో వైరస్ ఉన్నా.. 14 రోజుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. ఆ సమయంలో పరీక్షలు చేసినా.. నెగిటివ్ వస్తోంది. ఆ విషయం తెలియని వ్యక్తి ఆ 14 రోజుల్లో చాలా మందిని కలుస్తూ.. తనకు తెలీకుండానే మిగిలిన వారికి కరోనాను అంటిస్తున్నారు. ఈ కేసులను ఎసింప్టమేటిక్‌ కేసులు అంటారు. ఇప్పుడు ఈ కేసులు భారత్‌లో ఎక్కువవుతున్నాయని డాక్టర్లు చెబుతున్నారు.

దేశంలోని పది ప్రధాన రాష్ట్రాల్లో నమోదవుతోన్న కరోనా కేసుల్లో 65 శాతం ఎసింప్టమేటిక్‌ కేసులేనని.. వీటి వలన వైరస్‌ వ్యాప్తి ఎక్కువవుతోందని వారు చెబుతున్నారు. దీంతో వీలైనంత త్వరగా ఇలాంటి కేసుల్ని గుర్తించి.. ఐసోలేట్ చేయాలని డాక్టర్లు కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఓ సంస్థ జరిపిన విశ్లేషణలో మొత్తం పాజిటివ్‌ కేసుల్లో మహారాష్ట్రలో 65 శాతం, ఉత్తర్‌ప్రదేశ్‌లో 75శాతం, అసోంలో 82 శాతం ఇలాంటి కేసులు నమోదైనట్లు సమాచారం. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి కేసులు బయటపడుతున్నట్లు తెలుస్తోంది. చాలామంది విషయాల్లో అసలు కరోనా ఎప్పుడు ఎలా సోకిందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు.

Read This Story Also: కెనడాలో దారుణం.. 16 మంది మృతి.. 30ఏళ్ల చరిత్రలో తొలిసారి. !