ప్రముఖ దర్శకుడు విజయ బాపినీడు కన్నుమూత

|

Feb 12, 2019 | 12:04 PM

ప్రముఖ టాలీవుడ్ దర్శకనిర్మాత విజయ బాపినీడు ఇకలేరు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని స్వగ‌ృహంలో కన్నుమూశారు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులు ప్రకటించారు. సెప్టెంబర్ 22, 1936న చాటవర్రులో జన్మించిన బాపినీడు.. ‘మహానగరంలో మాయగాడు’, ‘హీరో’, ‘భార్యామణి’, ‘ఖైదీ నంబర్ 786’, ‘పట్నం వచ్చిన పతివ్రతలు’, ‘గ్యాంగ్ లీడర్’, ‘బిగ్‌బాస్’, ‘కొడుకులు’ వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. నిర్మాతగా చిరంజీవి, శోభన్ బాబు, మోహన్ బాబు, రాజేంద్ర ప్రసాద్ వంటి హీరోలతో హిట్ చిత్రాలను […]

ప్రముఖ దర్శకుడు విజయ బాపినీడు కన్నుమూత
Follow us on
ప్రముఖ టాలీవుడ్ దర్శకనిర్మాత విజయ బాపినీడు ఇకలేరు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని స్వగ‌ృహంలో కన్నుమూశారు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులు ప్రకటించారు. సెప్టెంబర్ 22, 1936న చాటవర్రులో జన్మించిన బాపినీడు.. ‘మహానగరంలో మాయగాడు’, ‘హీరో’, ‘భార్యామణి’, ‘ఖైదీ నంబర్ 786’, ‘పట్నం వచ్చిన పతివ్రతలు’, ‘గ్యాంగ్ లీడర్’, ‘బిగ్‌బాస్’, ‘కొడుకులు’ వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు.
నిర్మాతగా చిరంజీవి, శోభన్ బాబు, మోహన్ బాబు, రాజేంద్ర ప్రసాద్ వంటి హీరోలతో హిట్ చిత్రాలను నిర్మించారు. అలాగే ‘బొమ్మరిల్లు’, ‘విజయ’, ‘నీలిమ’ వంటి పత్రికలను కూడా ఆయన నడిపారు. ముఖ్యంగా చిరంజీవితో ఆయన సత్సంబంధాలు ఉన్నాయి. విజయ బాపినీడు మృతిపై టాలీవుడ్ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.