నందమూరి కల్యాణ్ రామ్ కొత్త మూవీ అమిగోస్ ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో ఆసక్తికర కామెంట్స్ చేశారు జూనియర్ ఎన్టీఆర్. బాధపెట్టడానికి కాదు.. ఇదో చిన్న విన్నపం అంటూనే అభిమానులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. అప్‌డేట్ అప్‌డేట్ అంటూ ఇబ్బంది పెట్టొద్దని అభిమానులను కోరారు. ప్రతి రోజూ, ప్రతి గంటా, ప్రతి క్షణం అప్‌డేట్స్ ఇవ్వాలంటే చాలా కష్టమన్నారు. అభిమానుల ఉత్సాహం, ఆరాటంతో డైరెక్టర్లు, నిర్మాతలపై ప్రెజర్ పెరిగిపోతోందంటూ కీలక కామెంట్స్ చేశారు ఎన్టీఆర్. అదిరిపోయే అప్‌డేట్ ఉంటే ఇంట్లోవాళ్ల కంటే ముందు మీకే చెబుతాం, మీరు మాత్రం దయచేసి వెంటపడొద్దంటూ అభిమానులకు సూచించారు.
ఇక తన నెక్ట్స్ మూవీపై అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు ఎన్టీఆర్. తన ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తూ డిటైల్స్ వెల్లడించారు. ఈ నెలలో ఓపెనింగ్ కార్యక్రమం, మార్చి నుంచి షూటింగ్ ఉంటుందని, సినిమా 2024 ఏప్రిల్ 5న సినిమా విడుదల అవుతుందన్నారు ఎన్టీఆర్. తన తమ్ముడు తారక్‌పై మరోసారి ప్రేమను బయటపెట్టారు కల్యాణ్‌రామ్. నా ప్రతి అడుగులో తోడుగా ఉన్నాడంటూ తన మనసులో మాటలను ఆవిష్కరించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..