Watch: రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ హీరోనే.. తిరుమలలో ఆ నటుడు చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే..

శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు వచ్చిన తమిళ హీరో అజిత్.. ఆలయం ముందు అభిమాని కోరిక తీర్చాడు. ఒకవైపు వర్షం కురుస్తుండగా శ్రీవారి దర్శనం అనంతరం బయటకు వచ్చిన అజిత్ తో ఫోటో దిగేందుకు ఒక యువకుడు ఆసక్తి చూపాడు. ఆలయం ముందు భక్తులతో మాట్లాడుతుండగా.. మూగ చెవిటి అయిన ఒక యువకుడు అజిత్‌తో సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేశాడు.

Watch: రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ హీరోనే.. తిరుమలలో ఆ నటుడు చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే..
Actor Ajith

Edited By: Shaik Madar Saheb

Updated on: Oct 28, 2025 | 1:58 PM

హీరో అజిత్.. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్నారు.. అయితే.. శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు వచ్చిన తమిళ హీరో అజిత్.. ఆలయం ముందు అభిమాని కోరిక తీర్చాడు. ఒకవైపు వర్షం కురుస్తుండగా శ్రీవారి దర్శనం అనంతరం బయటకు వచ్చిన అజిత్ తో ఫోటో దిగేందుకు ఒక యువకుడు ఆసక్తి చూపాడు. సుప్రభాత సేవలో శ్రీవారి దర్శనం చేసుకున్న అజిత్ ఆలయం ముందు భక్తులతో మాట్లాడుతుండగా.. మూగ చెవిటి అయిన ఒక యువకుడు అజిత్‌తో సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేశాడు.

మాటలు రాకపోవడంతో అజిత్‌కు ఎలా చెప్పాలో తెలియక మొబైల్ ఫోన్ లో ఫోటో తీసుకునేందుకు ఇబ్బంది పడ్డాడు. ఇది గమనించిన అజిత్ యువకుడి చేతిలో ఉన్న మొబైల్ తీసుకొని సెల్ఫీ తీసి తిరిగి ఇచ్చేశారు.. ఎంతో అభిమానంతో చనువుగా వ్యవహరించిన అజిత్ అందరినీ ఆకట్టుకున్నారు.

వీడియో చూడండి..

ప్రతి ఏటా శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే అజిత్ స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ మధ్యనే కారు రేస్ లో పాల్గొన్న అజిత్.. త్వరలో జర్మనీలో జరిగే కారు రేసింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అజిత్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..