OTT Movies: దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు, వెబ్ సిరీస్ లు.. వీటిని అసలు మిస్ అవ్వొద్దు
దసరా పండగను పురస్కరించుకుని ఈ వారం థియేటర్లలో పాటు ఓటీటీలోనూ ఆసక్తికరమైన సినిమాలు, వెబ్ సిరీస్ లు సందడి చేయనున్నాయి. ముఖ్యంగా ఇంతకు ముందు థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన పలు సూపర్ హిట్ సినిమాలు ఈ వారం ఓటీటీలో ఆడియెన్స్ కు వినోదం అందించనున్నాయి.

దసరా మొదలైంది. ఇప్పటికే స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇచ్చేశారు. దీంతో థియేటర్లలో ప్రేక్షకుల సందడి పెరగనుంది. అందుకు తగ్గట్టుగానే ఈ వారం థియేటర్లలో రజనీకాంత్ ‘జైలర్ 2’, విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నాల ‘రణబాలి’ చిత్రాలతో పాటు గరివిడి లక్ష్మి, క్రేజీ కళ్యాణం, ఎంత చిత్రం కథ అనే తెలుగు సినిమాలు సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనున్నాయి. మరోవైపు ఓటీటీల్లోనూ చాలానే చూడదగ్గ సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఓవరాల్ గా ఈ వీక్ లో 25 కు పైగా సినిమాలు, వెబ్ సిరీస్ లు వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో సందడి చేస్తున్నాయి. వీటిలో ఎన్న విలై, ద ట్రైటర్స్, ఆశా, కాగితం పడవలు, ఇట్స్ ఏ మెడికల్ మిరాకిల్ లాంటి సినిమాలు, సిరీస్ లు, రియాలిటీ షోలు ఉన్నాయి. మరి ఇంతకీ ఏ ఓటీటీలో ఏ సినిమా అందుబాటులోకి రానుందో తెలుసుకుందాం రండి.
నెట్ఫ్లిక్స్
- ద ట్రాప్ (జర్మన్ వెబ్ సిరీస్) – అక్టోబర్ 13
- టైసన్ (ఇంగ్లిష్ డాక్యుమెంటరీ సిరీస్) – అక్టోబర్ 13
- హంటింగ్ గ్యారీ గ్లిట్టర్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – అక్టోబర్ 14
- లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 11 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – అక్టోబర్ 14
- ఎన్న విలై (తెలుగు డబ్బింగ్ సినిమా) – అక్టోబర్ 15
- హాలీవుడ్ ఆర్ట్స్ (ఇంగ్లిష్ సిట్ కామ్ సిరీస్) – అక్టోబర్ 15
- ద డిప్లమాట్ సీజన్ 4 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – అక్టోబర్ 15
- ద స్టోర్మ్ (స్వీడిష్ సినిమా) – అక్టోబర్ 15
- మనీట్రాప్: ద కరుణ్ ట్రెజర్ (టర్కిష్ వెబ్ సిరీస్) – అక్టోబర్ 16
- డ్రాగన్ బాల్ సూపర్: బీరస్ (ఇంగ్లిష్ యానిమేటెడ్ సిరీస్) – అక్టోబర్ 16
జియో హాట్స్టార్
- డిస్ క్లోజర్ డే (ఇంగ్లిష్ సినిమా) – అక్టోబర్ 12
- కాఫీ విత్ కరణ్ సీజన్ 9 (హిందీ టాక్ షో) – అక్టోబర్ 14
- విజన్ క్వెస్ట్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – అక్టోబర్ 14
- క్రిస్టల్ లేక్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – అక్టోబర్ 15
- కప్పీ స్క్వాడ్ (తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్) – అక్టోబర్ 15
అమెజాన్ ప్రైమ్ వీడియో
- హెల్లువ బాస్ సీజన్ 3 (ఇంగ్లిష్ సిరీస్) – అక్టోబర్ 13
- లవ్ ఆఫ్ యువర్ లైఫ్ (ఇంగ్లిష్ మూవీ) – అక్టోబర్ 14
- ద ట్రైటర్స్ (తెలుగు రియాలిటీ షో) – అక్టోబర్ 15
- మాస్టర్ ప్లాన్ (ఇంగ్లిష్ మూవీ) – అక్టోబర్ 16
- టల్సా కింగ్ సీజన్ 4 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – అక్టోబర్ 16
సన్ నెక్స్ట్
- కాగితం పడవలు (తెలుగు సినిమా) – అక్టోబర్ 16
- ఒరు అన్వేషినంత్ తుడక్కమ్ (మలయాళ మూవీ) – అక్టోబర్ 16
జీ5 ఓటీటీలో
- ఆశా (తెలుగు డబ్బింగ్ మూవీ) – అక్టోబర్ 16
మనోరమ మ్యాక్స్
- ఇట్స్ ఏ మెడికల్ మిరాకిల్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – అక్టోబర్ 15
సోనీ లివ్
- డీసీ (తెలుగు డబ్బింగ్ మూవీ) – అక్టోబర్ 16
ఆపిల్ టీవీ ప్లస్
- టెంజింగ్ (ఇంగ్లిష్ సినిమా) – అక్టోబర్ 16
Note: ఇవి కాక వారం కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లను ఎలాంటి ముందస్తు ప్రకటనలు లేకుండా స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
