Sita Ramam: సీతారామం కథకు బీజం పడడానికి… కోఠిలో దొరికిన ఓ సెకండ్ హ్యాండ్ పుస్తకం కారణమని మీకు తెలుసా.?

Sita Ramam: సీతారామం.. ఇండియన్‌ సిల్వర్‌ స్క్రీన్‌పై ఓ సంచలనం. చిన్న సినిమాగా వచ్చి ఏకంగా రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరి సంచలనం సృష్టించిందీ సినిమా. యుద్ధంతో రాసిన ప్రేమ కథ అనే క్యాప్షన్‌తో తెరకెక్కిన ఈ సినిమా మూవీ లవర్స్‌ హృదయాల్లో...

Sita Ramam: సీతారామం కథకు బీజం పడడానికి... కోఠిలో దొరికిన ఓ సెకండ్ హ్యాండ్ పుస్తకం కారణమని మీకు తెలుసా.?
Sita Ramam

Edited By:

Updated on: Sep 12, 2022 | 2:36 PM

Sita Ramam: సీతారామం.. ఇండియన్‌ సిల్వర్‌ స్క్రీన్‌పై ఓ సంచలనం. చిన్న సినిమాగా వచ్చి ఏకంగా రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరి సంచలనం సృష్టించిందీ సినిమా. యుద్ధంతో రాసిన ప్రేమ కథ అనే క్యాప్షన్‌తో తెరకెక్కిన ఈ సినిమా మూవీ లవర్స్‌ హృదయాల్లో చెరగని మద్ర వేసింది. థియేటర్ల నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆడియన్స్‌ సీతారామం తాలూకు జ్ఞాపకాలను మర్చిపోలేకపోయారంటేనే ఈ సినిమా ఎలాంటి ఇంపాక్ట్‌ చూపించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హను రాఘవపూడి మార్క్‌ డైరెక్షన్‌, దుల్కర్‌ సల్మన్‌, మృణాల్‌, రష్మిక నటన.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమా కోసం పని చేసిన ప్రతీ టెక్నీషియన్‌ తమ ప్రతిభను 100 శాతం సినిమాకు ఇచ్చారా అన్నంతలా గొప్పగా ఈ సినిమా ఉంది.

ఇదిలా ఉంటే థియేటర్లలో సంలచనం సృష్టించిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీ వేదికగా కూడా హంగామా చేస్తోంది. అమెజాన్‌ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోన్న సీతారామం గడిచిన రెండు రోజులుగా అత్యధిక మంది చూస్తోన్న సినిమా జాబితాలో నిలవడం విశేషం. కేవలం తెలుగులోనే కాకుండా సబ్‌ టైటిల్స్‌ ద్వారా ఇతర భాషల్లోనూ ఈ సినిమాను వీక్షిస్తున్నారు. అమెజాన్‌లో ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్ అవుతోన్న చిత్రాల్లో ఒకటిగా ఇది నిలిచింది. ఇదిలా ఉంటే సీతారామం సినిమా కథ అంతా.. రామ్‌ రాసిన ఓ లేఖ చుట్టూ తిరుగుతుంది. రామ్‌ రాసిన లేఖ 20 ఏళ్ల తర్వాత సీతకు ఎలా చేరింది.? అసలు ఆ లేఖలో ఏముంది.? అన్నదే ఈ సినిమా కథ.

ఇవి కూడా చదవండి

అయితే ఈ లెటర్‌ ఆలోచన దర్శకుడు హను రాఘవపూడికి ఎలా వచ్చిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. గతంలో టీవీ9కి ఇచ్చిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో హను ఈ విషయాన్ని పంచుకున్నారు. హైదరాబాద్‌ కోఠిలో లభించే సెకండ్‌ హ్యాండ్‌ పుస్తకాలను కొనుగోలు చేసే అలవాటు ఉన్న హను.. ఓ రోజు ఒక పుస్తకాన్ని కొనుగోలు చేశాడంట. అయితే పుస్తకం చదువుతున్న క్రమంలో పేజీల మధ్యలో అతనికి ఓ లేఖ కనిపించింది. అయితే ఆ లేఖ అప్పటికీ ఓపెన్‌ చేసి లేదు. హైదరాబాద్‌లో విద్యనభ్యసిస్తున్న ఓ కుర్రాడికి ఊర్లో ఉన్న తన తల్లి పంపించిన లేఖ రాఘవపూడి మదిలో ఆలోచనలు రేకెత్తించేలా చేసింది. ఒక వ్యక్తికి పంపిన లేఖ, చివరికి అతనికి చేరిందా.? లేదా.? అన్న ఆలోచనలో నుంచే సీతారామం కథ పుట్టిందని చెప్పుకొచ్చాడు.

అయితే లెటర్‌ దొరికన తర్వాత వేరే సినిమాలను తెరకెక్కిస్తున్నా తన ఆలోచనలు మాత్రం ఎప్పుడూ ఆ లేఖ చుట్టే తిరిగాయని తెలిపిన హను.. సమయం దొరికినప్పుడల్లా ఆ కథపై వర్కవుట్‌ చేశానని తెలిపారు. అదే సమయంలో.. స్వప్న తనకు ఫోన్‌ చేసి ఏదైనా కథ ఉందా అని అడగడం,  ఈ కథను వివరించడం అలా.. సీతారామం దృశ్యరూపం దాల్చిందని హను రాఘవపూడి చెప్పుకొచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..