Theater- OTT Movies: పక్కా కమర్షియల్‌తో మొదలై ఈ వారం థియేటర్లు/ ఓటీటీల్లో అలరించే సినిమాలివే..

| Edited By: Ravi Kiran

Jun 29, 2022 | 7:34 AM

Movies Releasing this week: 2022లో ఆరు నెలలు గడిచిపోయాయి. మొదటి అర్ధభాగంలో పాన్‌ ఇండియా సినిమాలతో పాటు అగ్రహీరోల సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించాయి. వేసవిలోనూ బడా చిత్రాల హవా కొనసాగింది. ఇప్పుడు సమ్మర్‌ సీజన్‌ కూడా పూర్తైంది

Theater- OTT Movies: పక్కా కమర్షియల్‌తో మొదలై ఈ వారం థియేటర్లు/ ఓటీటీల్లో అలరించే సినిమాలివే..
Follow us on

Movies Releasing this week: 2022లో ఆరు నెలలు గడిచిపోయాయి. మొదటి అర్ధభాగంలో పాన్‌ ఇండియా సినిమాలతో పాటు అగ్రహీరోల సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించాయి. వేసవిలోనూ బడా చిత్రాల హవా కొనసాగింది. ఇక సమ్మర్‌ సీజన్‌ పూర్తైంది. వర్షాకాలం ప్రారంభమైంది. స్కూళ్లు, కాలేజీలు తెరచుకుంటున్నాయి. ఈక్రమంలో జులై మొదటి వారంలో థియేటర్లు/ ఓటీటీల్లో సందడి చేసేందుకు వస్తోన్న సినిమాలపై ఓ లుక్కేద్దాం రండి.

పక్కా కమర్షియల్‌

గోపిచంద్‌, రాశీఖన్నా జంటగా నటించిన చిత్రం పక్కా కమర్షియల్‌. ఫ్యామిలీ, కామెడీ కథలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన మారుతి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. . అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్‌ పతాకాలపై బన్నీ వాసు ఈ కామెడీ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ను నిర్మించాడు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా జులై 1 థియేటర్‌లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్‌

నటుడు మాధవన్‌ దర్శకుడిగా మారి తెరకెక్కిన చిత్రం రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌ . ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్‌ జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. మాధవన్‌ నంబినారాయణ్‌గా నటించాడు. సిమ్రాన్‌ కథానాయికగా నటించగా..సూర్య, షారుఖ్‌లు అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జులై 1న తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది.

ఏనుగు

గతంలో డబ్బింగ్‌ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు అరుణ్‌ విజయ్‌. కొన్ని తెలుగు సినిమాల్లో కూడా కనిపించి ఆకట్టుకున్నాడు. అతను నటించిన తాజా చిత్ర ఏనుగు. ప్రియభవానీ శంకర్‌ కథానాయిక. సింగం సిరీస్‌ ఫేమ్‌ హరి దర్శకత్వం వహించాడు. టైటిల్‌తోనే ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా జులై 1న రిలీజ్‌ కానుంది.

గంధర్వ

వంగవీటి, జార్జిరెడ్డి చిత్రాలతో ఆకట్టుకున్న సందీప్‌ మాధవ్‌, గాయత్రి ఆర్‌.సురేష్‌ జంటగా నటించిన మూవీ గంధర్వ. యాంటీ ఏజింగ్ అనే వెరైటీ కాన్సెప్ట్ తో ఈ సినిమా ముందుకు వస్తోంది. సాయికుమార్‌, సురేష్‌, బాబు మోహన్‌ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు అఫ్సర్‌ దర్శకుడు. సురేష్‌ కొండేటి నిర్మాత. జులై 1న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.

 

* ఇవి కాకుండా గరుడ వేగ అంజి డైరెక్షన్లో తెరకెక్కిన 10 క్లాస్‌ డైరీస్‌, ధన్సిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన షికారు సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

ఓటీటీల్లో అలరించనున్న చిత్రాలివే..

* అన్యాస్ ట్యుటోరియల్స్‌ – ఆహా- జులై 1

*కంగనా రనౌత్‌ ధాకడ్‌- జీ5- జులై1

*అక్షయ్‌కుమార్‌ సమ్రాట్‌ పృథ్వీరాజ్‌- అమెజాన్‌ ప్రైమ్‌- జులై1

ఇవి కూడా..

* ద టెర్మినల్‌ లిస్ట్‌ (తెలుగు డబ్బింగ్‌) – అమెజాన్‌ ప్రైమ్‌- జులై 1

* స్ట్రేంజర్‌ థింగ్స్‌ 4 (వెబ్‌ సిరీస్‌) – నెట్‌ఫ్లిక్స్‌- జులై 1

* షటప్‌ సోనా (హిందీ సిరీస్‌)- జీ 5- జులై 1

* మియా బీవీ ఔర్‌ మర్డర్‌ (హిందీ)- MX Player- జులై 1

* డియర్‌ విక్రమ్‌ (కన్నడ )- VOOT – జూన్‌30

 

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..