Box Office 2025: వామ్మో అన్ని లాభాలా? చిన్న బడ్జెట్‌తో తెరకెక్కి కోట్లు కొల్లగొట్టిన సినిమాలు!
ప్రస్తుతం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో భారీ బడ్జెట్‌లు, పెద్ద స్టార్‌డమ్‌ల రాజ్యమే నడుస్తోంది. అయితే, 2025 సంవత్సరం ఈ ధోరణికి భిన్నంగా నిలిచింది. ఈ సంవత్సరం చిన్న సినిమాలకు నిజంగా కలిసొచ్చిన కాలంగా చరిత్రలో నిలిచిపోతుంది. భారీ అంచనాలు లేకుండా, కొత్త నటీనటులు, దర్శకులతో విడుదలైన ..
ప్రస్తుతం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో భారీ బడ్జెట్‌లు, పెద్ద స్టార్‌డమ్‌ల రాజ్యమే నడుస్తోంది. అయితే, 2025 సంవత్సరం ఈ ధోరణికి భిన్నంగా నిలిచింది. ఈ సంవత్సరం చిన్న సినిమాలకు నిజంగా కలిసొచ్చిన కాలంగా చరిత్రలో నిలిచిపోతుంది. భారీ అంచనాలు లేకుండా, కొత్త నటీనటులు, దర్శకులతో విడుదలైన అనేక చిత్రాలు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి.
వందల కోట్లు ఖర్చు చేసిన పెద్ద సినిమాలు కూడా సాధించలేని లాభాలను, కేవలం కథా బలం, నటీనటుల సహజ నటన ఆధారంగా ఈ చిన్న సినిమాలు సాధించి చూపించాయి. ప్రేక్షకులు గ్లామర్ కంటే కంటెంట్ కే పట్టం కట్టడం, పరిశ్రమకు కొత్త శక్తినిచ్చింది.
బడ్జెట్ తక్కువ, లాభం ఎక్కువ
2025లో విజయం సాధించిన తక్కువ బడ్జెట్ చిత్రాలు కేవలం అదృష్టంపై ఆధారపడలేదు. అవి తెలివైన నిర్మాణ విలువలు, బలమైన స్క్రీన్‌ప్లే మరియు ఆడియన్స్‌తో కనెక్ట్ అయ్యే కథాంశాలపై దృష్టి పెట్టాయి. ఈ సినిమాలు ఆర్థికంగా లాభపడటమే కాక, సినీ పరిశ్రమలోని కొత్త ప్రతిభకు పెద్ద వేదికగా నిలిచాయి. పెట్టాయి. ఈ సంవత్సరంలో బాక్సాఫీస్‌ను కుదిపేసిన కొన్ని అద్భుతమైన చిన్న సినిమాలు..

Saiyyara1
సైయారా
మోహిత్ సూరి దర్శకత్వంలో వచ్చిన ఈ హిందీ సినిమా బడ్జెట్ రూ.45 కోట్లు అయినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.570.33 కోట్లు వసూలు చేసి, అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచింది.
మహావతార్ నరసింహ
రూ. 40 కోట్ల బడ్జెట్‌తో హోంబలే ఫిలింస్ నిర్మించిన ఈ యానిమేషన్ చిత్రం, భక్తి, సాంకేతికత సరైన మేళవింపుతో ప్రేక్షకులను మెప్పించి రూ.326.82 కోట్ల వసూళ్లు సాధించింది.

Krishna
కృష్ణ సదా సహాయతే
గుజరాతీ చిత్ర పరిశ్రమలో నిజమైన సంచలనం ఇది. కేవలం రూ.50 లక్షల అత్యంత తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, గుజరాతీలో తొలి రూ.100 కోట్ల సినిమాగా రికార్డు సృష్టిస్తూ, ఏకంగా రూ.109.5 కోట్లు వసూలు చేసింది.
సు ఫ్రమ్ సో
కన్నడ పరిశ్రమ నుంచి వచ్చిన ఈ చిత్రం కేవలం రూ.5 కోట్ల బడ్జెట్‌తో నిర్మించినా, రూ. 122.83 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. కథనం ఎంత బలంగా ఉంటే, ఆదరణ ఎంత ఉంటుందో ఈ సినిమా నిరూపించింది.

Tourist Family
టూరిస్ట్ ఫ్యామిలీ
కేవలం రూ.7 కోట్ల బడ్జెట్‌తో నిర్మించబడిన ఈ తమిళ చిత్రం, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుని రూ.87.23 కోట్ల వసూళ్లను సాధించింది.
ఈ చిత్రాలు ఆర్థికంగా లాభపడటమే కాక, సినీ పరిశ్రమలోని కొత్త ప్రతిభకు పెద్ద వేదికగా నిలిచాయి. ఇక్కడ ప్రధానంగా రెండు అంశాలు కీలకంగా ఉన్నాయి. ఈ చిన్న సినిమాల విజయానికి ప్రధాన కారణం మౌఖిక ప్రచారం. మొదటి రోజు వసూళ్లు తక్కువగా ఉన్నా, సినిమా బాగుందనే టాక్ ఒక్కసారి బయటకు రాగానే, వసూళ్లు ఊహించని విధంగా పెరిగాయి.
తక్కువ బడ్జెట్ చిత్రాలకు ముఖ్యంగా కొత్త దర్శకులు పనిచేశారు. వీరు రొటీన్‌కు భిన్నంగా ఆలోచించి, కథనంలో కొత్తదనాన్ని చూపించడం ఈ విజయాలకు ప్రధాన కారణం. 2025 సంవత్సర ధోరణి చూస్తుంటే చిత్రపరిశ్రమ రాబోయే సంవత్సరాల్లో అనేక మంది కొత్త ప్రతిభావంతులను ప్రోత్సహిస్తుందనడంలో సందేహం లేదు.




