Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa Movie: సమంత స్పెషల్‌ సాంగ్‌ను వీడని వివాదాలు.. ఈసారి వారి వంతు..

Pushpa Movie: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో.. ఆ మాటకొస్తే యావత్‌ దేశ వ్యాప్తంగా పుష్ప మేనియా కొనసాగుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా..

Pushpa Movie: సమంత స్పెషల్‌ సాంగ్‌ను వీడని వివాదాలు.. ఈసారి వారి వంతు..
Samantha Song
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 17, 2021 | 1:16 AM

Pushpa Movie: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో.. ఆ మాటకొస్తే యావత్‌ దేశ వ్యాప్తంగా పుష్ప మేనియా కొనసాగుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. మరికాసేపట్లే థియేటర్లలో సందడి చేయనున్న ఈ సినిమాపై ఆకాశనంటేలా అంచనాలున్నాయి. ఈ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సుకుమార్‌ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇక సినిమాకు సంబంధించిన ఇప్పటికే విడుదలై ట్రైలర్‌ సినీ ప్రేక్షకులకు కట్టి పడేసింది. సినిమాలోని పాటలకు కూడా ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మరీ ముఖ్యంగా సమంత నటించిన స్పెషల్‌ సాంగ్‌ ‘ఊ అంటావా మామ’ సంచలనం సృష్టించింది. ఈ మాస్‌ బీట్‌కు ఫిదా అవుతున్నారు. ఈ సాంగ్‌ లిరికల్‌ వీడియో రికార్డ్‌ వ్యూస్‌తో దూసుకుపోతోంది.

ఇదిలా ఉంటే ఈ పాటలో ఉన్న చరనాలు మగవారిని అగౌరవ పరిచేలా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్‌ పురుషుల సంఘం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పాటను బ్యాన్‌ చేయాలంటూ డిమాండ్‌ చేశారు. ఇక ఈ వివాదం ఇంకా ముగిసిపోకముందే మరో వివాదం చుట్టుముట్టింది. తమిళనాడులోనూ ఈ పాటకు వ్యతిరేకత వస్తోంది. తమిళంలో ‘ఓ సొల్‌రియా’ చరణంతో వచ్చే ఈ పాట.. అక్కడ కూడా సూపర్‌ హిట్‌ అయ్యింది. ఇప్పటికే 20 మిలియన్‌ పైగా వ్యూస్‌తో దూసుకుపోతోందీ పాట. అయితే ఈ పాటలో ఉన్న పదాలు పురుషులను కించపరిచేలా ఉందని పాటను బ్యాన్‌ చేయాలంటూ తమిళనాడులోని పురుషుల సంఘం ఏపీలోని చిత్తూరు కోర్టును ఆశ్రయించింది. ఈ పాటను తెలుగులో చంద్రబోస్‌ రచించగా, తమిళంలో గేయరచయిత వివేకా రాశారు.

Also Read: Mosquito Coil: ఇంట్లో దోమల కాయిల్స్ వెలిగిస్తున్నారా..? అయితే మీకు షాకింగ్ న్యూస్..

Shocking News: భర్త నచ్చలేదని అర్ధరాత్రి దురాగతం.. సలసల మరిగే నూనెతో భార్య ఏం చేసిందంటే..?

ట్రెక్కింగ్ కోసం హైదరాబాద్ చుట్టుపక్కల ఈ బ్యూటిఫుల్ ప్లేసెస్ గురించి తెలుసా..

ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌