AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రభాస్ ‘ఆదిపురుష్’ అలా సెట్ అయ్యిందట!

కరోనా లాక్‌డౌన్ వేళ తన తదుపరి రెండు చిత్రాలను ప్రకటించి, ఫ్యాన్స్‌కి డబుల్ ధమాకా ఇచ్చారు రెబల్‌స్టార్ ప్రభాస్‌

ప్రభాస్ 'ఆదిపురుష్' అలా సెట్ అయ్యిందట!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 26, 2020 | 8:38 PM

Share

Prabhas Adipurush movie: కరోనా లాక్‌డౌన్ వేళ తన తదుపరి రెండు చిత్రాలను ప్రకటించి, ఫ్యాన్స్‌కి డబుల్ ధమాకా ఇచ్చారు రెబల్‌స్టార్ ప్రభాస్‌. అందులో ఒకటి నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కే చిత్రం కాగా, మరొకటి బాలీవుడ్ దర్శకుడు ఓమ్‌ రౌత్ తెరకెక్కించనున్న ఆదిపురుష్ ఒకటి. నాగ్‌ అశ్విన్- ప్రభాస్ మూవీ సైన్స్ ఫిక్షన్ కథాంశంతో.. ఆదిపురుష్‌ రామాయణం నేపథ్యంలో తెరకెక్కనున్నాయి. బాహుబలి తరువాత తన క్రేజ్‌ను మరింత పెంచుకునేందుకు ఇలా డిఫరెంట్ చిత్రాలకు ఓకే చెప్పారు ప్రభాస్. అయితే ఈ కాంబినేషన్‌ ఎలా సెట్ అయ్యిందన్న విషయంపై ఓ వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది.

అదేంటంటే టీ సిరీస్‌లో నిర్మాణంలో అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమాను చేయాల్సి ఉందట. అయితే సందీప్ చెప్పిన కథ, రెబల్‌ స్టార్‌కి పెద్దగా నచ్చలేదట. ఈ క్రమంలో టీసిరీస్, ఓమ్‌ రౌత్‌ని లైన్‌లో తెచ్చిందట. ఇక ఓమ్‌ రౌత్‌ చెప్పిన కథ ప్రభాస్‌కి నచ్చేయడంతో వెంటనే ఈ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పారట. ఇలా ఆదిపురుష్ సెట్ అయినట్లు తెలుస్తోంది. కాగా 3డీలో తెరకెక్కబోయే ఈ చిత్రాన్ని టీ సిరీస్‌ భారీ బడ్జెట్‌తో నిర్మించనుంది. వచ్చే ఏడాది జనవరిలో ఈ మూవీని సెట్స్ మీదకు తీసుకువెళ్లనున్నట్లు ఓమ్ రౌత్ వెల్లడించారు.

Read More:

అమెరికాలో హత్య కేసు.. భారత మాజీ అథ్లెట్ అరెస్ట్‌

నాలుగు రోజుల షూటింగ్ తరువాత తీసేశారు.. రాత్రంతా ఏడ్చేదాన్ని

Follow Us
JEE Main పేపర్2 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా..ఇద్దరికి 100 పర్సంటైల్
JEE Main పేపర్2 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా..ఇద్దరికి 100 పర్సంటైల్
క్రెడిట్‌ కార్డ్‌ vs పర్సనల్‌ లోన్‌.. ఏది తక్కువ వడ్డీ!
క్రెడిట్‌ కార్డ్‌ vs పర్సనల్‌ లోన్‌.. ఏది తక్కువ వడ్డీ!
Horoscope Today: వారికి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం..
Horoscope Today: వారికి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం..
వంకాయ చికెన్ కర్రీ ఇలా వండితే.. గిన్నె కూడా వదలరు
వంకాయ చికెన్ కర్రీ ఇలా వండితే.. గిన్నె కూడా వదలరు
'ది బ్లఫ్' ప్రమోషన్లలో మెరిసిన దేశీ గర్ల్.. ఒక్కో వస్తువు లక్షలే
'ది బ్లఫ్' ప్రమోషన్లలో మెరిసిన దేశీ గర్ల్.. ఒక్కో వస్తువు లక్షలే
బాలీవుడ్ కపుల్స్ లగ్జరీ అబోడ్స్.. కోట్ల విలువైన తారల కలల సౌధాలు
బాలీవుడ్ కపుల్స్ లగ్జరీ అబోడ్స్.. కోట్ల విలువైన తారల కలల సౌధాలు
కోడిగుడ్డు ఎండుచేపల పులుసు ఇలా వండితే.. రోజూ కావాలంటారు
కోడిగుడ్డు ఎండుచేపల పులుసు ఇలా వండితే.. రోజూ కావాలంటారు
హ్యారీ బ్రూక్ వీరవిహారం.. పాకిస్థాన్‌పై ఇంగ్లండ్ ఘనవిజయం!
హ్యారీ బ్రూక్ వీరవిహారం.. పాకిస్థాన్‌పై ఇంగ్లండ్ ఘనవిజయం!
మష్రూమ్ ఆమ్లెట్ ఇలా వేసి తింటే ఎవరైనా ఆహా అనాల్సిందే..
మష్రూమ్ ఆమ్లెట్ ఇలా వేసి తింటే ఎవరైనా ఆహా అనాల్సిందే..
రాగి పిండితో అదిరే బ్రేక్ ఫాస్ట్! తక్కువ నూనె, ఎక్కువ ప్రోటీన్
రాగి పిండితో అదిరే బ్రేక్ ఫాస్ట్! తక్కువ నూనె, ఎక్కువ ప్రోటీన్