ఆ ఆఫర్ నాకే ముందు వచ్చింది. అయితే బన్నీ కాకుండా నేను చేస్తే అట్టర్ ఫ్లాప్‌ అయ్యేదంటున్న అక్కినేనివారబ్బాయి

|

Feb 19, 2021 | 3:43 PM

సినిమాలను సెలెక్ట్‌ చేసుకోవడంలో సుమంత్ స్టైలే వేరు.. అందరూ తమ ఇమేజ్‌ కోసం సినిమాలు చేస్తుంటే.. సుమంత్ మాత్రం తీరిగ్గా.. కూల్‌గా.. తనకు సెట్టయ్యే సినిమాలు చేస్తూ పోతుంటాడు. అలా తనకు...

ఆ ఆఫర్ నాకే ముందు వచ్చింది. అయితే బన్నీ కాకుండా నేను చేస్తే అట్టర్ ఫ్లాప్‌ అయ్యేదంటున్న  అక్కినేనివారబ్బాయి
Follow us on

Sumanth reveals Bunny movie: టాలీవుడ్ లో అక్కినేని ఫ్యామిలీ నుంచి మూడో తరం మొదటి వారసుడుగా వెండి తెరపై హీరోగా అడుగు పెట్టిన సుమంత్ .. కెరీర్ ఒక హిట్, రెండు ప్లాప్ లు అన్నచందంగా సాగుతుంది. మంచి పర్సనాలిటీ, నటన అన్నీ ఉన్న ఈ అక్కినేని కుర్రాడికి ఎందుకు హిట్ రావడం లేదంటూ అనే మాటలు సర్వసాధారణం వినిపిస్తూనే ఉన్నాయి. ఇక సినిమాలను సెలెక్ట్‌ చేసుకోవడంలో సుమంత్ స్టైలే వేరు.. అందరూ తమ ఇమేజ్‌ కోసం సినిమాలు చేస్తుంటే.. సుమంత్ మాత్రం తీరిగ్గా.. కూల్‌గా.. తనకు సెట్టయ్యే సినిమాలు చేస్తూ పోతుంటాడు. అలా తనకు సెట్టవ్వని సినిమాలను రిజెక్ట్ చేస్తూ.. తనకు సెట్ట అయ్యే సినిమాలే చేస్తూ.. ఇండస్ట్రీలో మిస్టర్‌ కూల్ గా రిజస్టర్ అయ్యడు. కాని ఇలాంటి కూల్ యాటిట్యూడ్‌తో చాలా వరకు సూపర్ హిట్టు సినిమాలను వదులుకొని.. హీరోల రేసులో కాస్త వెనుక పడ్డాడు కూడా…

అలా ముందు తనకే వచ్చిన ఓ సూపర్ హిట్టు చిత్రం బన్నీ కెరీర్లో దిమ్మతిరిగే వసూళ్లు రాబట్టి.. బన్నీ కెరీక్‌ని విపరీతంగా బూస్ట్‌ చేసిన సినిమా దేశముదురు. డాషింగ్‌ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ డైరెక్షన్లో వచ్చిన ‘దేశ ముదురు అప్పట్లో కలెక్షన్ల వర్షం కురిపించింది.

అయితే ఈ సినిమా ముందు సుమంత్ వద్దకు వెళ్లిందట. దేశముదురు సినిమా స్టోరీని మొదట పూరీ జగన్నాథ్‌ సుమంత్‌కే చెప్పాడట. ఇదే విషయాన్ని హీరో సుమంత్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ‘‘ఓసారి ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ నన్ను కలిసి.. మాస్‌, కమర్షియల్‌ హంగులున్న కథ చెప్పారు. కథ నాకెంతో నచ్చింది. కానీ అది నాకు సెట్‌ కాదు. దాంతో నేను సున్నితంగా తిరస్కరించాను. ఆ తర్వాత పూరీ.. అల్లు అర్జున్‌తో కలిసి ఆ స్టోరీ ని ‘దేశముదురు’ పేరుతో తెరకెక్కించాడు. ఒకవేళ నేనే కనుక ఆ సినిమా చేసి ఉంటే తప్పకుండా ఫ్లాప్‌ అయి ఉండేది. బన్నీ చేశాడు కాబట్టే అది హిట్‌ అయ్యింది.’’ అని చాలా కూల్ గా మ్యటర్‌ చెప్పేశాడు. ఈ కపటధారి..

Also Read:

మాజీ ప్రజాప్రతినిధి వివాహ వార్షికోత్సవంలో అశ్లీల నృత్యాలు.. ఆలస్యంగా వెలుగులోకి వీడియోలు..

అందానికి అందం, అభినయానికి అభినయం.. అందుకే చిత్రసీమలో శిఖరాగ్రం