Vijay Devarakonda: విజయ్, అనన్యను ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన కరణ్.. వద్దంటూ రిక్వెస్ట్ చేసిన దేవరకొండ..

|

Jul 26, 2022 | 5:16 PM

నీకు చీజ్ ఇష్టమా ? అని కరణ్ అడగ్గా.. ఇది ఎక్కడికి దారి తీస్తుందో అంటూ విజయ్ చిరునవ్వు ఇచ్చాడు. అలాగే విజయ్‏ను తన స్టైల్లో బోల్డ్ ప్రశ్నలు వేశారు.

Vijay Devarakonda: విజయ్, అనన్యను ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన కరణ్.. వద్దంటూ రిక్వెస్ట్ చేసిన దేవరకొండ..
Vijay Devarakonda
Follow us on

ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా లైగర్ (Liger). డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా లెవల్లో రూపొందుతున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‏గా నటిస్తుండగా.. రమ్యకృష్ణ, మైక్ టైసన్ కీలకపాత్రలలో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ఆగస్ట్ 25న తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో గ్రాండ్‏గా విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ షూరు చేసింది చిత్రయూనిట్. ఈ క్రమంలోనే తాజాగా విజయ్ దేవరకొండ, అనన్య పాండే ప్రముఖ రియాలిటీ షో కాఫీ విత్ కరణ్ షోలో (Koffee With Karan) సందడి చేశారు. ఇందులో భాగంగా విజయ్, అనన్యను తన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు కరణ్.

నీకు చీజ్ ఇష్టమా ? అని కరణ్ అడగ్గా.. ఇది ఎక్కడికి దారి తీస్తుందో అంటూ విజయ్ చిరునవ్వు ఇచ్చాడు. అలాగే విజయ్‏ను తన స్టైల్లో బోల్డ్ ప్రశ్నలు వేశారు కరణ్. లాస్ట్ టైం సెక్స్ ఎప్పుడూ చేశారు ? కరణ్ ప్రశ్నించగా.. నో క్వశ్చన్ రద్దు చేయండి అంటూ రిప్లై ఇచ్చాడు విజయ్. వీరిద్దరి మధ్యలో అనన్య మాట్లాడుతూ.. నేను ఊహించి చెప్పనా.. ఈరోజు ఉదయం విజయ్ వ్యాయమం చేశాడు అంటూ చెప్పేసింది. ఈరోజు ఉదయమా అంటూ కొనసాగించాడు కరణ్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

బాక్సింగ్ నేపథ్యంలో రాబోతున్న లైగర్ చిత్రంలో విజయ్ బాక్సర్‏గా కనిపించనున్నాడు. ఇటీవల విడుదలైన ట్రైలర్ యూట్యూబ్‏లో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇందులో విజయ్ కు నత్తి ఉన్నట్లుగా ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, ఛార్మి, పూరి జగన్నాథ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.