మిత్రుల నుంచి శత్రువులుగా మారిన హీరోలు.. కారణమిదే!

| Edited By:

Mar 12, 2020 | 2:38 PM

యువ హీరోలు వరుణ్ తేజ్, నితిన్‌లు శత్రువులుగా మారుతున్నారు. వీరిద్దరూ మంచి స్నేహితులన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరూ శత్రువులుగా మారబోతున్నారు. అందేంటా అని ఆశ్చర్యపోకండి....

మిత్రుల నుంచి శత్రువులుగా మారిన హీరోలు.. కారణమిదే!
Follow us on

యువ హీరోలు వరుణ్ తేజ్, నితిన్‌లు శత్రువులుగా మారుతున్నారు. వీరిద్దరూ మంచి స్నేహితులన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరూ శత్రువులుగా మారబోతున్నారు. అందేంటా అని ఆశ్చర్యపోకండి. నిజ జీవితంలో కాదు.. బాక్సాఫీస్ పోరు కోసమే.

ప్రస్తుతం మెగా హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్‌కి సంబంధించిన కథలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే వైజాగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుందీ చిత్రం. కాగా.. మరోవైపు నితిన్.. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్‌ దే’ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ రెండు సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్ ముందు రాబోతున్నాయట.

ఇప్పటికే ఈ రెండు సినిమాలు సగానికిపైగా షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. జులై 30న బాక్సాఫీస్ బరిలో నిలవబోతున్నాయట. నిజానికి గతంలో రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ కోసం ఈ తేదీని అనుకున్నారు. దీంతో.. ఆ తేదీకి మంచి ప్రచారం దక్కింది. అనంతరం వారు డ్రాప్ అయి.. వచ్చే ఏడాది జనవరి 8న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక అదే డేట్‌ని తమ చిత్రాలకు ఉపయోగించుకోవాలని అనుకుంటున్నారు ఈ రెండు టీమ్స్. త్వరలోనే ఈ విషయంపై స్పష్టత వచ్చే వీలుంది.

Read More this also: వైసీపీ ఆవిర్భావ రోజు.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్

మహిళా సీఐపై చేయి చేసుకున్న వైసీపీ నేత..

హీరో, హీరోయిన్‌కు కరోనా.. షాక్‌లో సినీ ఇండస్ట్రీ

మరో 10 రోజుల్లో భారీగా తగ్గనున్న పెట్రోల్ ధరలు.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ఎస్‌బీఐ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. మినిమమ్ బ్యాలెన్స్ రూల్ తొలగింపు

బ్రేకింగ్: ఇటలీలో చిక్కుకున్న విద్యార్థులకు విముక్తి.. కేంద్రం ప్రత్యేక సాయం