Actress Lahari: తొమ్మిదో నెల గర్భంతో నటి లహరి.. గ్రాండ్‌గా సీమంతం చేసిన స్నేహితులు.. ఫొటోస్‌ చూశారా?

చైల్డ్‌ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన లహరి చక్రవాకం, మొగలిరేకులు, ముద్దుబిడ్డ, ఇంటింటి గృహలక్ష్మి వంటి పలు సూపర్‌హిట్‌ ధారావాహికల్లో నటించి మెప్పించింది. కాగా ప్రస్తుతం యాక్టింగ్‌కు విరామం ఇచ్చిందీ బుల్లితెర నటి. త్వరలో ఆమె తల్లి కానుండడమే దీనికి కారణం.

Actress Lahari: తొమ్మిదో నెల గర్భంతో నటి లహరి.. గ్రాండ్‌గా సీమంతం చేసిన స్నేహితులు.. ఫొటోస్‌ చూశారా?
Actress Lahari

Updated on: Jul 30, 2023 | 4:39 PM

లహరి.. బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదని పేరు. టీవీ సీరీయల్స్‌లో చక్కటి చీరకట్టుతో ఎంతో సంప్రదాయ బద్దంగా కనిపించే ఈ అందాల తారకు క్రేజ్‌ బాగా ఉంది. చైల్డ్‌ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన లహరి చక్రవాకం, మొగలిరేకులు, ముద్దుబిడ్డ, ఇంటింటి గృహలక్ష్మి వంటి పలు సూపర్‌హిట్‌ ధారావాహికల్లో నటించి మెప్పించింది. కాగా ప్రస్తుతం యాక్టింగ్‌కు విరామం ఇచ్చిందీ బుల్లితెర నటి. త్వరలో ఆమె తల్లి కానుండడమే దీనికి కారణం. ప్రస్తుతం తొమ్మిదోనెల గర్భంతో ఉందామె. ఈక్రమంలో త్వరలో అమ్మగా ప్రమోషన్‌ పొందనున్న లహరికి తాజాగా సీమంతం ఎంతో వేడుకగా జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులంతా కలిసి ఈ వేడుకను ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఎప్పటిలాగే సంప్రదాయ దుస్తుల్లో ఎంతో అందంగా కనిపించింది లహరి. అలాగే భార్యాభర్తలు మ్యాచ్‌ అయ్యేలా దుస్తులు ధరించారు. ప్రస్తుతం లహరి సీమంతం ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. పలువురు సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు అందాల తారకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

కాగా గతంలోనే లహరికి ఓసారి సీమంతం జరిగింది. అయితే తొమ్మిదో నెల కావడంతో మరోసారి ఈ వేడుకను సెలబ్రేట్‌ చేశారు లహరి స్నేహితులు. ఇక సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ సీరియల్‌ నటి ఎప్పటికప్పుడు తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన విషయాలను, ఫొటోలు, వీడియోలను అందులో షేర్‌ చేస్తుంటుంది. కాగా పుట్టబోయే చిన్నారి కోసం ఇప్పటికే అన్ని రకాలు ఏర్పాట్లు చేసుకుంది లహరి. బిడ్డ ధరించే దుస్తులు, బ్యాగులు, బెడ్‌.. ఇలా అన్నింటినీ ముందుగానే సమకూర్చుకుంది. వీటికి సంబంధించిన వీడియోలను ‘OK Lahari’పేరుతో ఉండే తన సొంత యూట్యూబ్‌ ఛానెల్‌లో షేర్‌ చేస్తోంది. అన్నట్లు లహరి కొన్ని సినిమాల్లోనూ నటించింది. కెరీర్ ప్రారంభంలో మహేశ్‌బాబు నటించిన అర్జున్‌ సినిమాలో ఓ పాత్రలో తళుక్కుమంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..