Boss Season 6: నా సామిరంగా.. బిగ్ బాస్‌ 6లో గర్జించిన కామన్ మ్యాన్.. ఫస్ట్ ఫైనలిస్ట్‌గా దూసుకెళ్లిన వైనం..

|

Nov 30, 2022 | 6:29 PM

ఆదిరెడ్డి టికెట్ టు ఫినాలే టాస్క్ గెలిచినప్పటికీ.. ఈ వీక్ నామినేషన్స్ నుంచి సేవ్ కావాలి. అప్పుడు అతను టికెట్ టు ఫినాలే ద్వారా ఫైనలిస్ట్ అవుతాడు.

Boss Season 6: నా సామిరంగా.. బిగ్ బాస్‌ 6లో గర్జించిన కామన్ మ్యాన్.. ఫస్ట్ ఫైనలిస్ట్‌గా దూసుకెళ్లిన వైనం..
Bigg Boss Adireddy
Follow us on

కామన్ మ్యాన్ టూ బిగ్ బిస్ రివ్యూవర్.. బిగ్ బాస్ రివ్యూవర్ నుంచి బిగ్ బాస్ కంటెస్టెంట్.. కంటెస్టెంట్ నుంచి కెప్టెన్.. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 5 ఫస్ట్ ఫైనలిస్ట్‌గా ఆదిరెడ్డి ఎంపికైనట్లు సమాచారం వస్తుంది. టికెట్ టు ఫినాలే టాస్క్‌‌లో ఆదిరెడ్డి విన్నర్ అయినట్లు పక్కా సమాచారం అందింది. దీంతో సీజన్ 6 ఫస్ట్ ఫైనలిస్టుగా అవతరించాడు ఉడాల్ మామ. ఇప్పుడు ప్రధాన సమస్య అంటే.. ఈవారం నామినేషన్స్ నుంచి బయటపడితేనే.. టికెట్ టూ ఫినాలే ద్వారా ఫైనల్‌కి వెళ్తాడు. దండిగా ఓట్లు పడ్డాయి కాబట్టి అతను సేవ్ అవ్వడం కామన్ అని అందరూ అంటున్నారు. ఏమైనా గూడుపుఠాణి జరిగితే మాత్రం చెప్పలేం. టికెట్ టు ఫినాలే నెగ్గినందుకు.. ఆదిరెడ్డి నెక్ట్స్ వీక్.. నామినేషన్స్‌ నుంచి ఉపశమనం లభిస్తుంది. మిగిలినవారందరూ నామినేషన్స్‌లో ఉంటారు. ఈ వీక్ ఇంటి నుంచి ఇద్దరు వెళ్లిపోయే చాన్స్ ఉంది.

ఎందుకంటే ప్రజంట్ లోపల ఉన్న 8 మందిలో ఐదుగురు ఫినాలేకు వెళ్లాలంటే..  ఈ వీక్ లేదా నెక్ట్స్ వీక్.. డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉంది. మొత్తంగా ఉడాల్ మామ ఫైనలిస్ట్ అవుతాడు అనడంలో ఎలాంటి అనుమానం లేదు. స్టార్టింగ్ నుంచి ఆత్మ విశ్వాసంతో కనిపించాడు ఆదిరెడ్డి. ఎక్కడా ఫౌల్ గేమ్ ఆడలేదు. నిజాయితీగా తన పాయింట్స్ చెబుతూ ముందుకు వెళ్లాడు. ఎంత ఇబ్బంది ఎదరయినా.. 2, 3 టైమ్స్ తప్పితే టెంపర్ లూజ్ అవ్వలేదు.

మిగతా అందరికీ పీఆర్ టీమ్స్ ఉన్నాయ్.. అంతేకాక.. ఎంతోకొంత జనాల ఫాలోయింగ్ ఉంది. కానీ ఆదిరెడ్డికి అవేం లేవు. దీంతో సామాన్య జనం అంతా అతడిని ఓన్ చేసి.. ఇప్పటివరకు సేవ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇదే సపోర్ట్ కొనసాగితే ఆదిరెడ్డి సీజన్ విన్నర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..