MasterChef India: సౌత్‌లో మాస్ట‌ర్ చెఫ్ హోస్ట్ చేయ‌బోతున్న స్టార్లు వీరే…

|

Jun 20, 2021 | 12:53 PM

ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీకి మెయిన్‌ హబ్‌గా మారుతోంది ఇండియా. ఇంటర్‌నేషనల్‌ లెవల్‌లో పాపులర్ అయిన చాలా రియాలిటీ షోస్ ఇప్పుడు ఇండియన్ రీజినల్...

MasterChef India:  సౌత్‌లో మాస్ట‌ర్ చెఫ్ హోస్ట్ చేయ‌బోతున్న స్టార్లు వీరే...
Masterchef
Follow us on

ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీకి మెయిన్‌ హబ్‌గా మారుతోంది ఇండియా. ఇంటర్‌నేషనల్‌ లెవల్‌లో పాపులర్ అయిన చాలా రియాలిటీ షోస్ ఇప్పుడు ఇండియన్ రీజినల్ లాంగ్వేజెస్ మీద కాన్సన్‌ట్రేట్ చేస్తున్నాయి. ఇప్పటికే బిగ్ బాస్‌ లాంటి షోస్‌ ఇక్కడ కూడా మోస్ట్ సక్సెస్‌ఫుల్ లిస్ట్‌లోకి చేరాయి. బిగ్ బ్రదర్‌గా ఫారిన్‌ కంట్రీస్‌లో పాపులర్ అయిన షోను.. బిగ్ బాస్‌ పేరుతో ఇండియాకు తీసుకువచ్చారు. ముందు హిందీలో స్టార్ట్ అయిన షో.. ఇప్పుడు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ రెగ్యులర్‌గా నడుస్తోంది. అమితాబ్‌ బచ్చన్‌ హోస్ట్ చేస్తున్న కేబీసీ… అదే కౌన్‌ బనేగా కరోడ్ పతి కూడా అలా ఇండియాకు వచ్చిందే. `హూ వాంట్స్‌ టు బి ఏ మిలియనీర్?` అనే ఇంటర్‌నేషనల్‌ షోను ఇండియాలో కేబీసీగా ఇంట్రడ్యూస్ చేశారు. తరువాత ఈ షో కూడా రీజినల్ లాంగ్వేజెస్‌లో సత్తా చాటుతోంది. త్వరలో ఎన్టీఆర్‌ హోస్ట్‌ గా తెలుగులో మరోసారి టెలికాస్ట్ కానుంది.

ఈ లిస్ట్‌తోకి మరో రియాలిటీ షో కూడా యాడ్ అవుతోంది. ఫారిన్‌లో సూపర్ హిట్ అయిన మాస్టర్ చెఫ్ ఇప్పుడు ఇండియన్ రీజినల్ లాంగ్వేజెస్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే తమిళ వర్షన్‌కు యాంకర్‌గా విజయ్‌ సేతుపతిని ఎంచుకున్న యూనిట్ టీజర్‌ కూడా వదిలింది. అదే షోను తెలుగులో తమన్నా హోస్ట్‌గా, మలయాళంలో పృథ్వీరాజ్‌ హోస్ట్‌గా.. కన్నడలో సుధీప్‌ హోస్ట్‌గా ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ కాంబినేషన్స్‌కు సంబంధించి టీజర్లు రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు మాస్టర్‌ చెఫ్ ఆర్గనైజర్స్‌.

Also Read: పాన్ ఇండియా ట్రెండ్‌లోనే సరికొత్త వెర్షన్‌… శేఖర్ కమ్ముల అండ్ ధనుష్ చేస్తున్న డ్యూయల్ ఎఫర్ట్‌

పైకి మామ‌డి పండ్ల లోడే.. లోప‌ల చెక్ చేసి ఖంగుతిన్న పోలీసులు