ఏవండోయ్ మీకు ఓలేటి లక్ష్మి గారు గుర్తున్నారా మీకు..? సోషల్ మీడియా యూజ్ చేసే అందరికీ ఈమె గురించి తెల్సు. కోవిడ్ వచ్చిందని చెప్పేందుకు కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ నుంచి ఫోన్ చేసిన హెల్త్ ఇన్‌స్పెక్టర్‌తో ఆమె సంభాషణ నవ్వులు పూయించింది. ఆమె అమాయకత్వంతో, తెలియనితనంతో చెప్పిన సమాధానాలతో పాటు తాను మాట్లాడకుండా చుట్టుపక్కల వారికి ఫోన్ ఇవ్వడంతో.. హెల్త్ ఇన్‌స్పెక్టర్ అసహనానికి లోనై కర్మ కొద్దీ దొరుకుతారు జనాలు, మీ దుంపలు తెగ.. మీరెక్కడ తయారయ్యార్రా బాబు అంటూ పంచ్‌లు పేల్చాడు. ఆ ఆడియో రికార్డింగ్ అప్పట్లో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అప్పటికి, ఇప్పటికీ అలా వైరల్ అవుతూనే ఉంది.
కాగా ఈ వీడియోను బేస్ చేసుకుని గతంలో చలాకీ చంటి జబర్దస్త్ కామెడీ షోలో ఓ స్కిట్ చేశాడు. అది విపరీతంగా క్లిక్ అయ్యింది. సూపర్ ఫన్ జనరేట్ అయ్యింది. యూట్యూబ్‌లో అయితే ఆ వీడియోను 23 లక్షల మందికి పైగా చూశారు. అయితే ఆ ఓలేటి లక్ష్మి ఆడియో క్లిక్ అయ్యింది కానీ ఆ మనిషి ఎవరో ఎవరికీ తెలిదు. అయితే ఓలేటీ లక్ష్మి ఈమే అంటూ తాజాగా శ్రీదేవి డ్రామాకు కంపెనీ ప్రొగ్రామ్‌కు ఓ మహిళను తీసుకొచ్చారు. అయితే ఆమె ఓలెటి లక్ష్మి కాదు. ఏదో ఆడియెన్స్‌ను మభ్యపెట్టి రేటింగ్ పొందే ప్రయత్నం చేశారు షో నిర్వాహకులు.
అసలు ఓలెటి లక్ష్మి కృష్ణా జిల్లాకు చెందినవారు. గతంలో ఆమెను కొన్ని యూట్యూబ్ చానల్స్ ఇంటర్వ్యూ చేశాయి కూడా. అర్థరాత్రి ఫోన్ చేయడంతో కాస్త భయపడి అలా మాట్లాడినట్లు ఆమె తెలిపారు. తొలుత అందరికీ తెలియడంతో ఇబ్బందిగా అనిపించిందని.. తర్వాత పెద్దగా పట్టించుకోలేదని.. జోక్‌గా అనిపించిందని ఆమె చెప్పారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ న్యూస్ కోసం..