Kamal Haasan: కమల్ హాసన్ పై తమిళనాడు ప్రభుత్వం సీరియస్.. కరోనా నిబంధనలు ఉల్లంఘించారంటూ..

|

Dec 06, 2021 | 12:38 PM

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ పై తమిళనాడు ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది

Kamal Haasan: కమల్ హాసన్ పై తమిళనాడు ప్రభుత్వం సీరియస్.. కరోనా నిబంధనలు ఉల్లంఘించారంటూ..
Kamal Haasan
Follow us on

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ పై తమిళనాడు ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన వెంటనే బిగ్‏బాస్ షో షూటింగ్‏లో పాల్గోనడంపై తమిళ్ సర్కాక్ సీరియస్ అయ్యింది. కరోనా నిబంధనలు ఉల్లఘించి బిగ్ బాస్ షూటింగ్ చేయడం కరెక్ట్ కాదని.. సెల్ఫ్ ఐసొలేషన్‏లో ఉండకుండా ఇటువంటి షోలకు షూటింగ్ వెళ్లడం ద్వారా మిగతా వారికీ ప్రమాదం ఉండే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న ప్రముఖులే బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తారా ? అంటూ ప్రశ్నించింది. ఈ ఘటన పై తక్షణమే వివరణ ఇవ్వాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ నుండి నోటీసులు జారీ చేసింది తమిళ్ సర్కార్.

ఒకవైపు ఒమిక్రాన్‌ వణుకు పుట్టిస్తోంది. మరోవైపు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. పదుల సంఖ్యలో కేసులు బయటపడుతున్నాయి. ప్రతి ఒక్కరూ మస్ట్‌గా రూల్స్‌ పాటించాలని మొత్తుకుంటున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. కానీ కొంతమంది నిబంధనలకు బేఖాతరు చేస్తున్నారు. తాజాగా నటుడు కమల్‌హాసన్‌పై తమిళనాడు సర్కార్ సీరియస్ అయింది. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్నారు కమల్‌హాసన్. ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్‌ తీసుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ఐతే వెంటనే బిగ్‌బాస్‌ షూటింగ్‌లో పాల్గొన్నారు. దీంతో ఐసోలేషన్‌లో ఉండకుండా షూటింగ్‌కు హాజరవడంతో సీరియస్‌ అయింది ప్రభుత్వం. కరోనా నిబంధనలు ఉల్లంఘించి బిగ్‌ బాస్‌ షూటింగ్‌లో పాల్గొనడం కరెక్ట్‌ కాదని..పూర్తిగా కోలుకోకుండానే షూటింగ్‌లకు హాజరైతే మిగతావారికీ వైరస్‌ వ్యాపించే ప్రమాదముందని హెచ్చరించింది.

ఇటీవల అమెరికాకు వెళ్లోచ్చిన తర్వాత కమల్ హాసన్ స్వల్ప లక్షణాలతో ఇబ్బంది పడ్డారు. దీంతో కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. వైద్యుల సూచనలతో క్యారంటైన్ లో ఉంటూ చికిత్స తీసుకున్నారు కమల్.

Also Read: RaviTeja: రామారావు డ్యూటీకి వచ్చేది అప్పుడే.. మాస్‌ మహారాజా సినిమా రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌..

Priyanka Singh: మానస్, కాజల్ వీడియో చూపించిన అరియానా.. మానస్ నుంచి ఇది ఎక్స్‏పెక్ట్ చేయలేదంటూ ప్రియాంక ఎమోషనల్..

Chinmayi Sripada: కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేస్తారు.. అమ్మాయిలను స్వతంత్రంగా బతకనివ్వరు.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్..