తమిళ హీరోతో పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్!

| Edited By:

Apr 27, 2020 | 8:27 AM

ఓ తమిళ హీరోతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారట. క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ ఓ చారిత్రక నేపథ్యం ఉన్న కథలో నటిస్తున్న విషయం తెలిసిందే కదా. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించే ఓ ఆసక్తికర విషయం నెట్టింట్లో..

తమిళ హీరోతో పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్!
Follow us on

ఓ తమిళ హీరోతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారట. క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ ఓ చారిత్రక నేపథ్యం ఉన్న కథలో నటిస్తున్న విషయం తెలిసిందే కదా. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించే ఓ ఆసక్తికర విషయం నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. క్రిష్ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం తమిళ హీరో శివ కార్తికేయన్‌ను తీసుకోనున్నారని ప్రస్తుతం టాక్ నడుస్తోంది. అలాగే చర్చలు కూడా సాగుతున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయట.

మరి కార్తికేయన్ పాత్ర ఎలా ఉంటుంది? ఎంతసేపు ఉంటుందంటే? క్రిష్ అనౌన్స్‌మెంట్ వరకూ వేచి చూడక తప్పదు. పవన్, శివ కార్తికేయన్ కాంబినేషన్ అనగానే సినీ ప్రియుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. ‘కౌసల్య కృష్ణమూర్తి’ చిత్రంతో తెలుగులో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు కార్తికేయన్. ఇటీవలే విడుదలైన ‘శక్తి’ చిత్రం సైతం తెలుగులో మంచి టాక్‌ తెచ్చిపెట్టింది.

Read More: 

మళ్లీ లాక్‌డౌన్‌ పొడిగింపుకే మొగ్గుచూపుతోన్న సీఎం కేసీఆర్

అన్నీ తెలిసే వెళ్లాడు.. తనకి నేనేం సలహాలు ఇస్తాను? పవన్‌పై చిరు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

లైవ్‌లో ‘ఐలవ్‌యూ చెప్పి ముద్దు’ అడిగిన నెటిజన్.. ఇంటికొచ్చి మరీ తంతానంటోన్న హేమ